వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైటులో ఉన్న తెలుగు పుస్తకాలను డీఎల్‌ఐ పేజీలకు లింకులతో సహా జాబితా రూపొందించి, ఆ జాబితాను తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు, కొత్త వ్యాసాలు రూపొందించేందుకు ఉపయోగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా|DLI లోని తెలుగు పుస్తకాల జాబితా]]]]ను అభివృద్ధి చేసి, దానిలోని సమాచారంతో తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేస్తాము.
== ప్రాజెక్టు ప్రయోజనం ==
[[భారత డిజిటల్ లైబ్రరీ|డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో]] పాతిక వేలకు పైగా తెలుగు పుస్తకాలు ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టులోని పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివే అవుతాయి. కానీ, కొన్ని పుస్తకాలు కాపీరైట్ ఉన్నవి కాగా వాటి రచయితల నుండి అనుమతులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంత ప్రయోజనకరమైన వెబ్‌సైటును వికీమీడియన్లు ఉపయోగించుకుంటే తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్స్, తెలుగు వికీకోట్స్, తెలుగు విక్ష్నరీ బాగా అభివృద్ధి చెందుతాయి.<br />
దురదృష్టవశాత్తూ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అపురూపమైన గ్రంథాలు ఉన్నా వాటి పేర్లు, రచయితల పేర్లు, వివరాలు వంటివి వెబ్‌సైట్‌లో పొందిపరిచిన తీరు సరిగా లేదు. తెలుగులో సరళమైన పేరును లిప్యంతరీకరణ(ట్రాన్స్‌లిటరేషన్) చేసేవారు తెలుగు వారికి అర్థం కాని విధంగా, సెర్చ్ ద్వారా వెతుక్కోవడానికి సాధ్యం కాని విధంగా తయారు చేశారు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి మొదటి పదిపేజీలు డౌన్‌లోడ్ చేసుకుని చదివితే కానీ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియని స్థితి నెలకొంది. అందువల్ల ఈ పుస్తకనిధి నుంచి ప్రయోజనాలు రాబట్టుకోలేకపోతున్నాం.<br />
ఈ ప్రాజెక్టు ద్వారా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా|DLI లోని తెలుగు పుస్తకాల జాబితా]]]] పేజీలో ఎంచుకున్న పుస్తకాలకు వివరాలతో కాటలాగ్(పుస్తకాల జాబితా) తయారు చేస్తాం. ఆ వివరాల్లో పుస్తకం పేరు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(డీఎల్‌ఐ) లింకు, రచయిత/సంపాదకుని పేరు, విభాగం(కాటగిరీ), పుస్తకంలోని సమాచారం గురించి క్లుప్తంగా వివరాలు, డీఎల్‌ఐ వారు పుస్తకానికి ఇచ్చిన కోడ్, పుస్తకం ముద్రింపబడిన తేదీ ఉంటాయి. అలాగే కొందరు వికీపీడియన్లు తెవికీలో ఈ పుస్తకాల్లోని సమచారం ఉపయోగించి వ్యాసాలను అభివృద్ధి చేయడం, కొత్త వ్యాసాలు తయారుచేయడం చేస్తారు.
== ఏం చెయ్యాలి ==
=== జాబితా పని ===
* తెలుగు వికీపీడియాలోని [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా|DLI లోని తెలుగు పుస్తకాల జాబితా]]]] సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ జాబితాలు(అకార క్రమంలో) వాటిలో ఇచ్చిన ఆప్షన్లు గమనించండి.
* [http://www.dli.gov.in/ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా]లోని తెలుగు పుస్తకాల కోసం వెతికి జాబితాలో పొందుపరచని మంచి పుస్తకం ఏదైనా ఉంటే దాన్ని వేరే టాబ్‌లో తెరవండి.
* ఆపైన పుస్తకం పేజీలు తెరిచి వివరాల కోసం కొన్ని పేజీలు డౌన్లోడ్ చేయండి. వాటిలోని పుస్తకం పేరు, రచయిత పేరు చూసి ఇక్కడ పొందుపరుస్తూ, పుస్తకానికి చేరేందుకు లింకు కూడా జాబితాలో ఇవ్వండి.