లెనిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
</pre>
 
20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. మార్క్సిజం పేరిట మనుషుల్ని మలచాలనే ప్రయత్నంలో ఆయన చేసిన [[కృషి]] నేడు చారిత్రక ఆధారాలతో అందుబాటులో ఉంది. శ్రీశ్రీ మహాహంతకుల జాబితాలో ఎందుకోగాని లెనిన్ పేరులేదు. స్టాలిన్ పేరు కావాలని చేర్చలేదు సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక [[సిద్ధాంతం]] పేరిట చంపితే ఆదిమానవ కళ్యాణానికి దారితీస్తుందనీ, మరో ఇజం పేరిట హతమారిస్తే దారుణమనీ భాష్యం చెప్పడం దురుద్దేశ్యంతోనే. నిష్పాక్షికంగా చూస్తే నరహంతకుల జాబితాలో ఈ శతాబ్దంలో ప్రథమస్థానం, అగ్రతాంబూలం లెనిన్ కు ఇవ్వాల్సిందే. లెనిన్ అసలు పేరు బ్లాడిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్ కాగా అమ్మ నాన్న పెట్టినపేరు మార్చుకొని కొత్త పేరుతో చలామణిగావడం ఒకసంప్రదాయం. అలాగే రహస్య పార్టీలో పనిచేసే వారు కూడా పేరు మార్చుకుంటుంటారు. 1870లో ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. మాస్కో గ్రంథాలయంలో[[గ్రంథాలయం]]<nowiki/>లో చాలా విషయ సేకరణ చేశాడు. ఒక సూట్ కేసు అడుగున మరో రహస్య అర ఏర్పరచి, నిషిద్ద [[గ్రంథాలు]] చేరవేస్తుండగా పట్టుబడి, సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.
 
తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ [[క్రైస్తవులు]], కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు [[సన్యాసి]] జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు.
 
ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు. లెనిన్ ను సన్నిహితంగా పార్టీలో చూచినవారు ఆయన నియంతృత్వ పోకడలపై దాడిచేశారు. ప్లెఖనోవ్, వేరా జెసూలిక్, ట్రాటస్కీ, మదాం క్రిజిజెనోవిస్కియా, చార్లస్ రాపాఫోర్ట్, వై ఛస్లావ్ మెంజిస్కీ మొదలైన వారంతా లెనిన్ను తెగిడారు. కాని ఇలాంటి తిట్లను, శాపనార్ధాలను, విమర్శలను లెనిన్ ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎనుబోతుపై వర్షం పడ్డట్లే విమర్శల దారి విమర్శలదే, లెనిన్ గొడవ లెనిన్ దే. అదే ఆయన ఏకాగ్రత విశిష్టత.
పంక్తి 75:
1921 మేలో లెనిన్ పార్టీ బయట రాజకీయ కార్యకలాపాలకు స్వస్తి చెబుతూ ప్రకటన చేశారు. అంతటితో చెకా రంగంలో ప్రవేశించి కొందరని మట్టుపెట్టగా మరికొందరిని ప్రవాసానికి పంపారు పార్టీ సభ్యత్వానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1921లో లెనిన్ ఆధ్వర్యాన 585000 మందికి పెరిగింది. పార్టీ సర్వాధికారి అయింది కేంద్రీకృత పార్టీ నాయకత్వాన్ని లెనిన్ కట్టుదిట్టం చేశాడు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపేశాడు. స్టాలిన్ ద్వారా తన ఉత్తరువులు అమలు జరిగేటట్టు లెనిన్ వత్తాసుదారులే వుండడం వలన ఇక అరాచకాలెన్ని చేసినా అడిగేదిక్కు లేకుండా పోయింది.
 
1922 మే 25న లెనిన్ కు తొలిసారి తీవ్రంగా జబ్బుచేసింది. అంతకుముందే లెనిన్ కు బాగా తలనొప్పి వస్తుండేది. సెలవు తీసుకోడానికి నిరాకరించిన లెనిన్ 1921 జూలైలో ఒక నెల విశ్రాంతి తీసుకున్నాడు. పనితగ్గించమని ఆగస్టులో పోలిట్ బ్యూరో ఉత్తరువులిచ్చింది. 1922లో అలాంటి ఉత్తరువులు తిరిగి యిచ్చారు. 1922 మే నుండి అక్టోబరు 2 వరకూ లెనిన్ విశ్రాంతి తీసుకోగా, తిరిగి వచ్చిన అనంతరం కూడా అధికార [[పత్రాలు]] అందుబాటులో లేకుండా చేశారు.లెనిన్ ఆరోగ్య పరిరక్షణాధికారిగా 1922 డిసెంబరు 18న స్టాలిన్ నియమితుడైనాడు. లెనిన్ రహస్యంగా పనిచేస్తూ తన భార్య కృపస్క మాకు ఉత్తరాలు చెప్పి వ్రాయించడం స్టాలిన్ కు నచ్చలేదు.
 
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమిషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
"https://te.wikipedia.org/wiki/లెనిన్" నుండి వెలికితీశారు