ఎర్ర రక్త కణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
ఒకొక్క ఎర్ర కణంలో సుమారు 270 మిలియన్ల [[హిమోగ్లోబిన్]] బణువులు ఉంటాయి. ఒకొక్క [[బణువు]] (molecule) ఎన్నో [[అణువు]]ల (atoms) సముదాయం. ఒక బణువు ఎంత పెద్దదో చెప్పాలంటే దాని బణు భారం (molecular mass) చెబుతాం. ఒక ఉదజని బణువులో రెండు ఉదజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 2. ఒక ఆమ్లజని బణువులో రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 32. అదే విధంగా హిమోగ్లోబిన్ బణు భారం 64,000 డాల్టనులు ఉంటుంది. అనగా, ఒక [[మోల్]] హిమోగ్లోబిన్ ఉరమరగా 64,000 గ్రాములు తూగుతుంది.
 
ఒకొక్క హిమోగ్లోబిన్ బణువు కేవలం నాలుగు ఆమ్లజని అణువులని ఊపిరితిత్తుల దగ్గర సంగ్రహించి శరీరంలోని జీవకణాలకి అందజేస్తుంది. ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి విశేషమైన సేవ చేస్తాయి. ఇవి పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా సుమారు 75,000 సార్లు ఊపిరితిత్తుల నుండి జీవకణాలకి ఆమ్లజనిని అందజేసి, సుమారు నాలుగు నెలలపాటు విశ్రాంతి లేకుండా పని చేసి, అవసాన కాలానికి తమ జన్మస్థానమైన మజ్జ ([[:en:marrow]]) లోకి చేరుకుంటాయి. అక్కడ ఉన్న తెల్ల కణాలు వీటిని కబళించి మింగెస్తాయి.
 
==కంటి ముందు బుడగలు==
సగటు మగవాడి శరీరంలో సుమారు 25 ట్రిలియన్లు ఎర్ర కణాలు, సగటు ఆడదాని శరీరంలో సుమారు 17 ట్రిలియన్లు ఎర్ర కణాలు ఉంటాయి. వీటిలో వెయ్యింటికి ఎనిమిది చొప్పున రోజూ చచ్చిపోతాయి.అనగా, రోజుకి 200 బిలియన్లు చొప్పున (లేదా, సెకండుకి 2,300,000 చొప్పున చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని మజ్జ చేరుకోకుండానే, దారిలో, చచ్చిపోయి రక్త ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇలా చితికి, చివికి పోయిన కణ భాగాలు మన కంటి గుడ్డులోని నేత్రరసంలో చేరి తెప్పలులా తేలియాడుతాయి. అవే మన కంటి ముంది తేలియాడుతూ, బుడగలలా కనిపించే మచ్చలు.
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_రక్త_కణం" నుండి వెలికితీశారు