కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 1:
[[దస్త్రం:Kasikrishnacharyulu.png|right|250px|thumb|కాశీ కృష్ణాచార్యులు]]
'''కాశీ కృష్ణాచార్యులు'''(1872-1967)“[[అవధానము (సాహిత్యం)|అవధాని]] శిరోమణి” బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసులు, అనేక భాషలు నేర్చిన పండితులు. సంగీతం, వీణ, వేణువు,వయోలిన్ మృదంగాది వాద్యాలు, [[వడ్రంగి|వడ్రంగం]],[[మృణ్మయ పాత్రలు|కుమ్మరం]], [[నేతపని|నేత]],ఈత,వంటకం,వ్యాయామం,కుస్తి,గారడీ మొదలైన [[చతుష్షష్టి కళలు|చతుష్షష్ఠి కళ]]<nowiki/>లన్నీ నేర్చిన మహా మనీషి<ref name="కవితామహేంద్రజాలమ్">{{cite book|last1=ప్రసాదరాయ|first1=కులపతి|title=కవితా మహేంద్రజాలమ్|publisher=డాక్టర్ కులపతి షష్టిపూర్తి అభినందన సమితి|location=హైదరాబాదు|url=httphttps://dliarchive.gov.inorg/scriptsdetails/FullindexDefaultin.htm?path1=/data/upload/0000/749&first=1&last=244&barcode=2020120000750ernet.dli.2015.393050|accessdate=18 July 2016}}</ref>.
==జీవిత విశేషాలు==
వీరు కవి, పండితులు మాత్రమే కాదు, అవధానులు, సంగీత విద్వాంసులు కూడ. వీరు సంస్కృత భాషా బోధనకు, ప్రచారానికి జీవితాంతం పాటుపడిన వ్యక్తి. [[గుంటూరు]] హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. వీరి శిష్యులు పండ్రంగి రామారావు ఎఫ్.ఎ.చదువుతూ శతావధానాన్ని నిర్వహించడం వీరి చలవే.[[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] మరణానంతరం 1961లో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు ఆ పదవిని అలంకరించారు. 1965లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.