నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
starring =[[సుత్తివేలు]],<br />[[విజయ నరేష్|నరేష్]],<br>[[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]],<br>[[పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] |
}}
'''నాలుగు స్తంభాలాట''' [[జంధ్యాల]] దర్శకత్వంలో, [[విజయ నరేష్|నరేష్]], [[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]], [[పూర్ణిమ (నటి)|పూర్ణిమ]], [[తులసి (నటి)|తులసి]] ముఖ్యపాత్రల్లో నటించగా [[నవతా కృష్ణంరాజు]] నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను [[సంజయ్ దత్]], [[అశోక్ కుమార్]], పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో [[సుత్తి వీరభద్రరావు]], [[సుత్తి వేలు]] చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది.
 
== చిత్ర కథ ==
నరేష్ ([[విజయ నరేష్]]), ప్రదీప్ ([[ప్రదీప్ (నటుడు)|ప్రదీప్]]) ప్రాణస్నేహితులు. నరేష్ ధనవంతుడు కాగా, ప్రదీప్ ది మధ్యతరగతి [[కుటుంబం]]. ప్రదీప్ ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలోని అమ్మాయి శారద ([[పూర్ణిమ (నటి)|పూర్ణిమ]])ని నరేష్ ప్రేమిస్తాడు. నరేష్, శారదలు కలవడానికి ప్రదీప్ రాయబారిగా సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ప్రదీప్, శారదల మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళ పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి నిశ్చయిస్తారు. అనుకోకుండా ఒకనాడు నరేష్, శారదలు శారీరికంగా దగ్గరవుతారు. నరేష్ మేనమరదలు కమల ([[తులసి (నటి)|తులసి]])కి అతనంటే విపరీతమైన ఇష్టం. శారదని పెళ్ళిచేసుకుంటే, చచ్చిపోతానంటూ నరేష్ అన్న బెదిరిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నరేష్, కమలని పెళ్ళిచేసుకుంటాడు. శారద [[గర్భవతి]] అయిందని తెలిసిన ప్రదీప్ ఆమె పరువు నిలబెట్టేందుకు తానే పెళ్ళిచేసుకుంటాడు. అయితే లోకం ముందు భార్యాభర్తలైనా, ఏకాంతంలో చెల్లెలిలా చూసుకుంటానని మాటిచ్చి పెళ్ళాడతాడు. ఆ మాటను నిలబెట్టుకుని ఆమెను అభిమానంగా చూసుకుని పెద్దమనసుతో వ్యవహరిస్తాడు. శారద ఆడపిల్లని కంటుంది, ఆ పాపకి నరేష్ తల్లి మహాలక్ష్మి పేరుపెడతాడు ప్రదీప్. తిరుపతి వెళ్ళేదారిలో రెండు జంటలు కలుస్తాయి. కమల మానసికంగా అనుభవించే క్షోభ చూసి నిద్రమాత్రలు మింగి చివరకు శారద ఆత్మహత్య చేసుకుంటుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===