ఆరవీడు వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 20:
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
==రెండవ వెంకటపతిరాయలు (1585 - 1614 )==
విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప, శక్తివంతులైన రాజుల్లో ఇతనే చివరివాడు. ఇతను కూడా [[దక్కన్]] ముస్లిం ల దాడికి లోనయ్యాడు. [[వెంకటరాయలు]] తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు. రుస్తుమ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన గోల్కొండ మొత్తం సైన్యాన్ని ఓడించి, గండికోటను ఆక్రమించుకున్నాడు. [[ఉదయగిరి]]తో పాటు, కృష్ణానది వరకూ ఉన్న ప్రాంతాలు వెంకటరాయల అధికారంలోకి వచ్చినాయి. రాజ్యంలోని తిరుగుబాట్లను కూడా అణచివేశాడు. మొగల్ చక్రవర్తి [[అక్బర్]] సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని రాయబారిని పంపినా ధైర్యంగా తిరస్కరించాడు. ఈతను [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకున్నాడు. ఇతను కవి పండిత పోషకుడు. ఈతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు. ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు. రెందో శ్రీరంగరాయల (1616) తరువాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642) లు పాలించారు. వీరి తరువాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు. ఆయన పరిపాలన కాలంలోనే బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు వర్తక సంఘంగా దక్షిణ భారతదేశంలోకి, మరీ ముఖ్యంగా [[తమిళ]], ఆంధ్రదేశాల్లోకి చేరప్రారంభించారు. [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా]] కంపెనీ వారు [[చెన్నపట్టణం]]లో కోటకట్టుకునేందుకు, చంద్రగిరిలో చర్చిలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740371485|accessdate=1 December 2014}}</ref>
 
==మూడో శ్రీరంగరాయలు (1642 - 1675 )==
"https://te.wikipedia.org/wiki/ఆరవీడు_వంశం" నుండి వెలికితీశారు