వేంకట రామకృష్ణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 1:
[[దస్త్రం:Venkataramakrishnakavulu.jpg|right|200px|thumb]]
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]<ref>[httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815|387835 [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]] పేజీలు 295-307]</ref><ref>[https://archive.org/details/in.ernet.dli.2015.492155 పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ - సి.కమలా అనార్కలి - పేజీలు: 341-352]</ref>. వీరు 1909 సంవత్సరములో పిఠాపుర సంస్థానంలో ప్రవేశించారు. నాటికి [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] వయస్సు 26 సంవత్సరాలు. [[వేదుల రామకృష్ణశాస్త్రి]] 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] ఈ కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి [[అవధానము]] చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన [[పిఠాపురం]] సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు. వీరు ఆ సంస్థానంలో [[శతావధానము]], శతవిధానము (గంటకు 100 పద్యాలు చెప్పుట), శత ప్రాసము (ఒకేప్రాసతో 100 పాదాలు గంటలో చెప్పుట), [[అష్టావధానము]] మొదలైనవాటిని నిర్వహించి పండితుల, ప్రభువుల మెప్పు పొందారు. వీరు పిఠాపుర సంస్థానంలో ప్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన [[తిరుపతి వేంకటకవులు|తిరుపతి వేంకటకవుల]]తో వాగ్యుద్ధం తటస్థించింది. రామకృష్ణకవులు వయసున చిన్నవారైనా ఆ కవుల కృతులలోని దోషాలను బయట బెట్టి 'శతఘ్ని' అనే ఖండన గ్రంథాన్ని ప్రకటించారు. ఈ వివాదం మొదట చక్కని కృతి విమర్శలతో ప్రారంభమై క్రమక్రమంగా శ్రుతి మించి వ్యక్తిదూషణలకు దారితీసింది. ఏదిఏమైనా ఆనాటి ఈ వివాదం సాహిత్యప్రియులకు మంచి కాలక్షేపాన్ని కలిగించింది. ఈ వాక్సమరంలో దేశము లోని పండిత కవులెందఱో కలుగ చేసికొని పైకి వచ్చారు. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టం. ఈ వివాదారంభంలో [[కవిత (మాసపత్రిక)|కవిత]] అనే మాసపత్రికను వీరు నెలకొల్పారు. ఈ పత్రిక తొమ్మిది ఏండ్లు అవిచ్ఛిన్నంగా సాగింది.
 
==అవధానాలు==
పంక్తి 52:
# అత్యద్భుత శతావధానము
# పరాస్తపాశుపతము
# ఆంధ్ర కథాసరిత్సాగరము (6 లంబకములు)<ref>[httphttps://wwwarchive.org/details/in.ernet.dli.gov2015.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20kathaa%20saritsaagaramu&author1=krxshhnd-a%20vein%27kat%27araama&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=289&barcode=2030020024940&author2=&identifier1=&publisher1=vein%27kat%27raama%20an%27d%27%20koo&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/968371740 భారత డిజిటల్ లైబ్రరీలో ఆంధ్ర కథాసరిత్సాగరము పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==