వసంతరావు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి →‎రచయితగా: fix bot mistake
పంక్తి 41:
 
== రచయితగా==
భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనలు ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశారు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించారు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసారు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడినాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32 లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి. ఆధునిక విజ్ఞానం<ref>{{cite book|last1=వేంకటరావు|first1=వసంతరావు|title=ఆధునిక విజ్ఞానం|url=https://archive.org/details/in.ernet.dli.2015.370927 }} </ref>పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఈయన సంకలనం చేసిన సూక్తిముక్తావళి అనే గ్రంథం కూడా ప్రసిద్ధి చెందింది.
 
మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి. తెలుగు అకాడమీ లో, 18 పుస్తకాలు డిగ్రీ విద్యార్థులకు వెలువరించారు. విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు నిర్వహించారు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు, జిజ్ఞాసలు తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళ మైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన [[1992]], [[ఏప్రిల్ 25]] న మృతి చెందారు.
"https://te.wikipedia.org/wiki/వసంతరావు_వేంకటరావు" నుండి వెలికితీశారు