సేలం: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్పు
విస్తరణ
పంక్తి 46:
 
== ప్రారంభ చరిత్ర ==
కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే ''హాయ్'' లేదా ''శల్య'' లేదా ''సయిలం'' అనే పదాలనుండి ''సేలం'' అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది. సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో చేర మరియు కొంగు రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడుకు చెందిన '''కురునిల మన్నర్గళ్''' అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు. స్థానిక జానపదకథల ప్రకారం [[తమిళ]] కవయిత్రి అవ్వయ్యార్ సేలం లోనే జన్మించింది. గంగా వంశానికి చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము కొంగు నాడు మధ్యలో ఉంది<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-in-school/winding-the-clock-back-anticolonial-wise/article6835999.ece|title=Winding the clock back, anti-colonial wise|author=Asha Sridhar|date=30 January 2015|newspaper=[[The Hindu]]|access-date=25 February 2017}}</ref>.
 
తరువాత సేలం పశ్చిమ గంగా రాజవంశంలో భాగమయి, చాలా కాలం గంగాకులం పాలకులు చేత పరిపాలించబడింది. [[విజయనగర సామ్రాజ్యము]], దక్షిణ దండయాత్రలో భాగంగా తమిళనాడుని ఆక్రమించినప్పుడు, సేలం మధురై నాయకుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత, సేలానికి చెందిన '''గట్టి ముదలిలు''' పోలిగర్లు పరిపాలించి, కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు కోటలను నగరం లోపలా బయటా నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, [[మైసూర్]]-[[మధురై]] యుద్ధం అని పిలవబడే దీర్ఘకాల వైరం తరువాత సేలం [[హైదర్ అలీ]] అధీనంలోకి వచ్చింది. తరువాత 1768 ప్రారంభంలో సేలంని హైదర్ అలీ నుండి కర్నల్ వుడ్ తీసుకున్నారు.<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-in-school/winding-the-clock-back-anticolonial-wise/article6835999.ece|title=Winding the clock back, anti-colonial wise|author=Asha Sridhar|date=30 January 2015|newspaper=[[The Hindu]]|access-date=25 February 2017}}</ref> 1772 సంవత్సరము చివరిలో హైదర్ అలీ సేలంని మళ్ళీ కైవసం చేసుకున్నారు. 1799లో లార్డ్ క్లైవ్ అధ్వర్యంలో సేలం మల్లి సంకరిదుర్గ్ లో ఉన్న సైన్య దళానికి చెందిన ఒక విభాగం చేత ఆక్రమణక గురయి, 1861 వరకు, సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించేవరకు, ఒక సైన్య స్థావరం లాగ ఉండేది. మాగ్నం చౌల్ట్రి (ప్రస్తుతం మగుడన్ చావడి అని పేరు మార్చబడింది) వంటి స్థలాలు ఇక్కడ చూడవచ్చు. దీరన్ చిన్నమలై కాలములో సేలం, సంకగిరి వంటి ప్రాంతాలలో కొంగు సైన్యం మరియు బ్రిటిష్ అలైడ్ సైన్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రఖ్యాతి పొందిన కొంగు నాయకుడు '''తీరన్ చిన్నమలై''' సంకగిరి కోటలో ''ఆడి పెరుక్కు రోజు'' న ఘోరంగా ఉరి తీయబడ్డాడు. ఈ స్థలమే తరువాత బ్రిటిష్ వాళ్ల ప్రధాన సైన్య శిబిరముగా మారింది.
 
== భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం ==
సేలం {{Coord|11.669437|N|78.140865|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/25/Salem.html ఫాలింగ్ రైన్ జెనోమిక్స్, ఇంక్ - సేలం]</ref>లో ఉంది. ఇది సగటుగా 278 మీటర్లు (912 అడుగులు) ఎత్తులో ఉంది. సేలం చుట్టూ కొండలు ఉన్నాయి. ప్రదేశం మొత్తం చిన్నకొండలుతో నిండి ఉంది<ref>{{cite web|url=http://www.fallingrain.com/world/IN/25/Salem.html|title=Falling Rain Genomic s, Inc&nbsp;– Salem|publisher=Fallingrain.com|access-date=10 April 2012}}</ref>.
== రాజకీయాలు ==
సేలంలో మూడు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి: సేలం ఉత్తరం, సేలం దక్షిణం మరియు సేలం పశ్చిమ. ఈ మూడూ సేలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి<ref>{{cite web
పంక్తి 58:
| accessdate = 2008-10-09
| work = Tamil Nadu
| publisher = Election Commission of India }}</ref><ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp88.htm|title=Partywise Comparison Since 1977|publisher=Election Commission of India|year=2011|access-date=29 December 2012}}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాఘవాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[చక్రవర్తి రాజగోపాలాచారి|సి. రాజగోపాలచారి]], డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలానికి చెందిన వాళ్లే. మోహన్ కుమారమంగళం, [[ఇందిరా గాంధీ]] మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు.
 
ప్రస్తుతం [[తమిళనాడు]] వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వీరప్ప ఆరుముగం (డి.ఎం.కె నేత) ఈ నగరానికి చెందిన వాడు.
పంక్తి 66:
 
జనాభాలో పురుషులు 64% మరియు స్త్రీలు 36%. సేలంలో సగటు అక్షరాస్యత రేటు 77%, ఇది జాతీయ సగటు 64.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 82%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 72%. సేలంలో 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు.
 
2011 జనాభా లెక్కల ప్రకారం సేలం జనాభా 826,267. వారిలో ప్రతీ 1000 మంది పురుషులకు 987 మంది స్త్రీలు కలరు. <ref name="dashboard">{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/censusinfodashboard/index.html|title=Census Info 2011 Final population totals|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2013|access-date=26 January 2014}}</ref> వారిలో 79,067 మంది ఆరేళ్ళ లోపు వారు. వారిలో 40,570 పురుషులు మరియు 38,497 స్త్రీలు. ఈ నగర అక్షరాస్యత రేటు 76.37%. ఇది జాతీయ సరాసరి 72.99% కంటే ఎక్కువ.<ref name="dashboard2" /> సేలంలో 215,747 కుటుంబాలున్నాయి. మొత్తం 332,147 కార్మికులు: 1599 రైతులు, 3,040 వ్యవసాయ కార్మికులు, 32,597 పారిశ్రామిక కార్మికులు, 16010 మంది పార్టు టైమ్‌ పనివారు. <ref name="2011census">{{cite web|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=684822|title=Census Info 2011 Final population totals&nbsp;– Salem(05740)|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2013|access-date=26 January 2014}}</ref>
 
మతపరమైన గణాంకాల ప్రకారం 2011 నాటికి 89.79% హిందువులు, 7.48% ముస్లింలు, 2.36% క్రిస్టియన్లు, 0.11% జైనులు, 0.02% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.2% మరియు ఇతర మతాల వారు and 0.02% ఉన్నరు.<ref name="religion2011">{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/C-01.html|title=Population By Religious Community - Tamil Nadu|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2011|format=XLS|access-date=13 September 2015}}</ref>
 
సేలంలో మాట్లాడే ప్రధాన భాష '''కొంగు తమిళం''' . సేలంలో [[జైనులు]], మార్వారీలు వంటి వ్యాపారంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్నారు. వీళ్ళు తమిళంలో మాట్లాడటానికి కూడా నేర్చుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు