దోమకొండ సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Domakonda Temple Front View.jpg|right|thumb|[[దోమకొండ]] కోటలోని మహాదేవుని ఆలయం]]
'''దోమకొండ సంస్థానము''' [[తెలంగాణా]]లోని ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న సంస్థానం. దోమకొండ [[కామారెడ్డి]] జిల్లాలో ఉన్నది. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. ఈ సంస్థానానికి బిక్కనవోలు (మెదక్ జిల్లా) సంస్థానమని కూడా నామాంతరం కలదు. ఈ సంస్థానాధీశులు తొలుత [[గోల్కొండ]] సుల్తానులకు, ఆ తరువాత అసఫ్‌జాహీలకు సామంతులుగా, దోమకొండ కేంద్రంగా కాసాపురం, [[సంగమేశ్వరం]], మహ్మదాపురం, విస్సన్నపల్లి, బాగోత్‌పల్లి, [[కుందారం]], [[పాల్వంచ]], దేవునిపల్లి వంటి నలభై గ్రామాలను పాలించారు.<ref>[http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/aug/7/telangana&more=2011/aug/7/sundaymain తెలంగాణ గడీలు - 6 రెడ్డి దొరల కళావైభోగం దోమకొండ గడీ - ఆంధ్రజ్యోతి]</ref> 19వ శతాబ్దంలో ఈ సంస్థానపు సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు. అందుకే దోమకొండ కోశాగారానికి కాపలాగా ఇరవై మంది అరబ్బులు ఉండేవారట. వీరు రెడ్డిదొరలైనప్పటికీ నిజాం ప్రభువులు వీరికి ''రావుబహద్దూర్'' అనే బిరుదు ఇవ్వడంతో కొంతమంది పాలకులు పేరు చివర రావు అన్న పేరుతో చలామణీ అయ్యారు.
 
1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా [[కామారెడ్డి]]కి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. ఈ వంశానికి చెందిన రాజన్న చౌదరి 1760 కాలంలో రాజధానిని[[రాజధాని]]<nowiki/>ని బిక్కనవోలు నుండి కామారెడ్డిపేటకు, ఇతని కుమారుడు రాజేశ్వరరావు కాలంలో కామారెడ్డి పేట నుండి దోమకొండకు మారినది. అప్పటి నుండి దోమకొండ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది.<ref>[http://www.maganti.org/chitraindex/pics/raja/domakonda.pdf ఆంధ్ర సంస్థానములు: సాహిత్యపోషణము - తూమాటి దొణప్ప]</ref> సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. [[కోట]], అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందకం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
 
==కామినేని వంశము==
పంక్తి 15:
దోమకొండ కోట (స్థానికులు దీన్ని దోమకొండ గడీ అని వ్యవహరిస్తారు) నలభై ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ రాతి కట్టడంతో కూడిన ప్రహరీగోడతో పాటు బయటివైపు నుంచి శత్రువులు రాకుండా ఉండేందుకు నిజాం రాజుల కోటలాగా మొత్తం గోడ చుట్టూ అతి పెద్ద నీటి కందకం కూడా ఉన్నది. తెలంగాణ జిల్లాల్లోని మరే గడీ (సంస్థానాధీశుల మహల్లను గడీలంటారు. ఇవి నిజమైన కోటల్లాగా రక్షణకి కాక కేవలం అధికార ఠీవీని ప్రకటించే భవనాలు) చుట్టూ ఇలాంటి నీటి కందకం లేదు. కోటలో ప్రవేశించేందుకు పడమర వైపు ఒక పెద్ద కమాన్, తూర్పు వైపు మరొకటి ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం మధ్యలో సంస్థానాధీశుల ప్రధాన నివాసం ''వెంకట భవనం'' ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు, పూలమొక్కల మధ్యన రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. భవనం పైభాగంలోని పాలరాతి ఫలకంపై వెంకట భవనం అని తెలుగులో, ఉర్దూలో రాసి ఉంది. ఆ కాలంలోనే ఈ భవనంపై పిడుగులు పడకుండా నిరోధించే పరికరాన్ని (ఎర్తింగ్) బిగించారు.
 
కోట నలభై ఎకరాల చుట్టూ నీటి కందకంతో పాటు కామినేని వంశస్థులే ఎత్తయిన రాతి గోడను నిర్మించారనీ కొందరంటే, కాకతీయులు ఆ గోడను నిర్మించగా సంస్థానాధీశులు అందులో [[భవనాలు]] కట్టుకున్నారని కొందరంటారు. కోటలోని మహదేవుని (శివుడు) ఆలయం ఉండడమే కాకతీయుల నిర్మించారనటానికి తార్కాణమని భావిస్తారు. దోమకొండ సంస్థానాధీశులు మొదట బికనూర్ (నిజామాబాద్ జిల్లా) సంస్థానాధిపతులనీ, [[బికనూర్]] పక్కనే సైనికులు, [[కాశీ]] యాత్రికులు రాకపోకలు సాగించే 'దండు రాస్తా' ఉన్నందువల్ల ఇబ్బందిగా భావించి దోమకొండకు వచ్చారనీ, అప్పటికే దోమకొండలో [[కాకతీయులు]] ప్రహరీగోడ, మహదేవుని ఆలయం నిర్మించారనీ కొందరి అభిప్రాయం. అయితే ఈ కథనానికి ఆధారాలేవీ లేవు
 
నగారా భవంతి - కోటలో నగారాను వినిపించడం కోసం ప్రత్యేకంగా ఒక భవంతిని నిర్మించారు. ఆ భవంతిపైన ఒక నీటి తొట్టెను ఏర్పరచి, దాంట్లో ఒక గిన్నెకి రంధ్రం చేసి ఉంచేవారట. [[తొట్టి]]<nowiki/>లోని నీరు గిన్నెలోకి నిదానంగా చేరి మునిగిపోయేది. దీని ఆధారంగా సమయాన్ని చెప్పేవారట. తెల్లవారు ఝామున నాలుగు గంటల నుండి నగారా మోగించేవారట. ఇది కూడా శుక్ర, ఆదివారాల్లో ప్రతి మూడు గంటలకొకసారి, మిగతా రోజుల్లో ఆరు నుండి పన్నెండు గంటలకొకసారి నగారా మోగించేవారట.
పంక్తి 24:
కామినేని వంశంలో అయిదవవాడైన మొదటి ఎల్లారెడ్డి కాలం నుండి సంస్థానంలో సాహితీ వికాసం జరిగింది. ఇతని కాలంలో సంస్థానంలో పలువురు [[కవులు]] ఉండేవారు. మొదటి ఎల్లారెడ్డి మనుమడైన రెండవ కాచిరెడ్డి కాలాన్ని సాహితీ స్వర్ణయుగంగా పేర్కొంటారు. మూడవ కాచిరెడ్డి కుమారుడైన మల్లారెడ్డి స్వయంగా కవియే కాకుండా పద్మపురాణోపరి భాగాన్ని అనువదించారు. మల్లారెడ్డి సోదరుడైన రెండవ ఎల్లారెడ్డి కూడా వాసిష్టము, లింగపురాణం అనే గ్రంథాలు రాసినట్టు చెబుతారు.
 
బహుభాషా విద్వాంసులైన మూడవ రాజేశ్వరరావు [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పార్శీ]], [[అరబ్బీ భాష|అరబ్బీ]] భాషల్లో చిరస్థాయిగా నిలిచే రచనలెన్నో చేశారు. ఈయన ఆధ్వర్యంలో పలు [[నిఘంటువులు]], సంకలన [[గ్రంథాలు]] కూడా వెలువడ్డాయి. ఈయన 'అజ్గర్' అనే కలం పేరుతో రాసేవారు. దోమకొండ కోటకు [[తిరుపతి వేంకట కవులు|తిరుపతి వేంకటకవులు]] కూడా వచ్చేవారట.
 
==స్వాతంత్ర్యానంతరం==
దోమకొండ సంస్థానాధీశుల పాలనకు మెచ్చి [[నైజాం]] రాజు [[హైదరాబాదు]]<nowiki/>లోని నాంపల్లి దగ్గర ఉమాబాగ్ అనే 30 ఎకరాలు ఇనాంగా ఇచ్చారు. సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయింది. దాంతో కామినేని వంశస్థులు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ కోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దోమకొండ_సంస్థానం" నుండి వెలికితీశారు