మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని , పధార్ధా → పదార్థా, అభివృద్ది → అభివృద్ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి<ref name="diag"/>. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు మరియు ఆంటీడయాబెటిక్ మందుల వాడకం వల్ల మరియు అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు. ఇంతకుమునుపు ఇన్సులిన్ [[పంది|పందుల]] క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతము చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులవల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ సహజ ఇన్సులిన్‌కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్‌సెట్ అఫ్ యాక్షన్ మరియు యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్‌ను ఇన్సులిన్ పంపు‌ల ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు.
 
డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా మరియు తీవ్రంగా (అక్యూట్) వచ్చే కాంప్లికేషన్స్‌ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్‌కీటోటిక్ హైపర్‌ఆస్మొలార్ కోమా వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు (రెట్టింపు ఆపద), దీర్ఘకాలిక మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్ రెటినోపతి (రెటీనా చెడిపోవడం తద్వారా [[అంధత్వము]] కలుగుతుంది), డయాబెటిక్ న్యూరోపతి (చాలా రకాలైన నాడీ కణాలు చెడిపోవడం), మరియు సూక్షనాళికలు చెడిపోవడం వల్ల కలిగే పురుషత్వ లోపం మరియు గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. గాయాలు సరిగా మానకపోవడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో గాంగ్రీన్ రావడం వల్ల ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు. డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం మరియు దైనందిన విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల (సిగరెట్లు మానివేయడం లాంటివి) మరియు ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం చేస్తే పైన చెప్పబడిన చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో యుక్తవయస్కులలో అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్ అవసరమయ్యే డయాబెటిక్ నెఫ్రోపతికి అతి ప్రధాన కారణం డయాబెటిస్ <ref>{{ఇంగ్లీష్}} {{cite web|url={{cite web /url=http://patients.uptodate.com/topic.asp?file=dialysis/15147 /title=UpToDate Dialysis in diabetic nephropathy /accessdate=2007-12-07 /format= /work=}} |title=UpToDate Dialysis in diabetic nephropathy |accessdate=2007-12-07 |last=Mailloux |first=Lionel |date=2007-02-13 |publisher=UpToDate }}</ref>.
 
== వ్యాధి లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు