మెగస్తనీసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''[[మెగస్తనీసు]]''' ([[క్రీ.పూ. 350]] - [[క్రీ.పూ. 290]]) ప్రాచీన [[గ్రీకు]] యాత్రికుడు మరియు సందర్శకుడు. [[ఆసియా మైనర్]] ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును [[మొదటి సెల్యూకస్|సెల్యూకస్]] గ్రీకు రాయబారిగా [[పాటలీపుత్రము]]లోని శాండ్రోకొట్టస్ ([[చంద్రగుప్త మౌర్యుడు]]) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము కచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తు]]<nowiki/>ని మరణ సంవత్సరమైన క్రీ.పూ. 288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
 
ప్రస్తుతం [[పాకిస్తాన్]] లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, [[ఆఫ్ఘనిస్తాన్]] మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. [[గంగానది]] మీదుగా [[పాటలీపుత్ర]]<nowiki/>ను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ.<ref>http://www.in2greece.com/english/historymyth/history/ancient/megasthenes.htm</ref>. మెగస్తనీస్ తన [[ప్రయాణం]]<nowiki/>లోని అనుభవాలని గ్రంథస్తం చేశాడు కానీ వాటిలో ఏమీ లభ్యం కావడం లేదు. తన రచనల్లో [[హిమాలయాలు]], [[టిబెట్]], [[శ్రీలంక]]<nowiki/>లను కూడా ప్రస్తావించాడు. [[మౌర్యులు|మౌర్యుల]] తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32 కోటలున్నాయని పేర్కొన్నాడు. భారతీయ పద్ధతులు, ధార్మిక, మత సంబంధమైన ఆచారాల గురించి, [[కుల వ్యవస్థ]] గురించి కూడా రాశాడు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మెగస్తనీసు" నుండి వెలికితీశారు