బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
అదేరోజు జమ్ము వెళ్లిన వి. పి. మినాన్ కు ఇండియా డొమినియన్లో జేరుటకు మహారాజ హరి సింగు అక్టోబరు 26, 1947న తన అంగీకార దస్తావేజు అందజేసెను. శాంతి భద్రతలు రాష్ట భాధ్యతగా నుండునన్న షరత్తు అంగీకార పత్రములో పేర్కోనబడియుండెను. గవర్నర్ జనరల్ కు సమపర్పించిన ఆ అంగీకార దస్తావేజు తో పాటు జమ్మూ కాశ్మీరు రాష్ట్రమున షైక్ అబ్దుల్లా ప్రభుత్వము నెలకొల్పుటకు నియమించినటుల తన నిర్ణయము కూడా తెలిపెను.<br>
 
శ్రీనగరు చేరుకున్న భారతదేశపు వైమానిక దళముసైన్యము:
రక్షణ మంత్రి బల్దెవ సింగు ఉత్తర్వులు ప్రకారము భారతసైనిక దళములు వాయుమార్గమున అక్టోబరు 27 తారీకుపొద్దున్న శ్రీనగరు విమానాశ్రయము ప్రవేసించి పరిస్తితులు అదుపులోకి తీసుకునిరి. ఆ సమచారముతెలుసుకున్నతరువాత పాకిస్తాన్ గవర్నర జనరల్ మహ్మదలీ జిన్నా తన సైనికాధికారి జనరల్ ఫ్రాంక్ మెస్సెర్వి కి పాకిస్తానీ సైన్యమును శ్రీనగరు తరలించమని ఉత్తర్వులుచేసెను. కాని పాకిస్తాని సైన్యాధక్షుడు ఆ ఉత్తర్వులను సిరసావహించుటకు నిరాకరించెను. ఢిల్లిలోనుండిన ఫీల్డు మార్షల్ అచిన్లెక్ కమాండులో క్రింది అదికారియైయిన మెస్సెర్వి ఒకే కమాండులో నుండిన సైనికాధికారులు రెండు వైపులా పోరాడుట యుద్దనీతికి విరధ్దమనియూ అదీకాక ఇండియా డొమీనియన్లో విలీనమైనతరువాతనుండి జమ్మూ కాశ్మీరు రాజ్యము స్వతంత్రరాజ్యము కాదనియు అచ్చటి రక్షణ పరిస్తితులకొరకు సైనిక బలగమునంపుట ఇండియా డొమినియన్ హక్కనియూ అట్టి స్తితిలో పాకిస్తాన్ సైన్యమునంపుట చట్ట విరుధ్దమనియు తన నిరాకరణకు కారణములుగా తెలిపెను. అట్టి న్యాయ విరుధ్దమగు జిన్నాహ ఉత్తర్వులును అమలుచేయవలసినచో తాను తన యావత్తు బ్రిటిష్ సైనిక బలగమును పాకిస్తాన్ సైన్యమునుండి ఉపసంహరించుకుని బ్రిటన్ కి పోవలసిన పరిస్థితి కలుగనని పాకిస్తాన్ సైనికాధికారి చేసిన తిరుగు హెచ్చరికతో పాకిస్తాన్ గవర్నరు జనరల్ జిన్నా ఏమియును చేయలేక ఉక్రొషముచే రాజకీయ మెలికలు సృష్టించెను .<br>
ఇండియా డొమినియన్లో జమ్మూ-కాశ్మీరు విలీనము గుర్తించమన్న పాకిస్థాను: జమ్మూ కాశ్మీరులో జరుపవలసిన ప్రజాభిప్రాయ నిర్ణయము (PLEBISCITE) ను గురించి 1947 అక్టోబరు 30 తేది మౌంటుబాటన్- జిన్నాహల సమావేశము జరిగియుండెను. షేర్ ఎ కశ్మీరు అని ప్రసిధ్ది చెందిన షైక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీరు రాష్ట్రమునకు ప్రధమ ముఖ్యమంత్రిగ నైయ్యెను. జమ్మూ కాశ్మీరులో ప్రజాభిప్రాయము ((PLEBISCITE) అంతర్జాతీయుల పర్యవేక్షణలో చేయబడునని ఇండియా డొమానియన్ ప్రధాన మంత్రి నవంబరు 2న ప్రకటించెను. పాకిస్తాన్ ప్రధానమంత్రి తన ప్రకటనలో ఇండియా డొమీనియన్లో జమ్మూకాశ్మీరు విలీనము అన్నాయపురీతి జరిగినదనియూ తమచే గుర్తింపు పొందబోదని ప్రకటించెను.
 
==మూలాలు==