కల్క్యావతారము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''[[కల్కి అవతారము]]''', [[దశావతారములు|దశావతారములలో]] పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో [[విష్ణువు]] కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
 
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే [[అవతారం]] గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.<ref>[http://www.ismaili.net/Source/nikakalki.html The Kalki Parana]</ref> కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం.<ref>{{cite web |url=http://www.yoga-philosophy.com/eng/kalki/kalki.htm |title=Appearance of Kalki Avatar |accessdate=2008-06-15 |year=2003 |work=yoga-philosophy.com}}</ref> [[బౌద్ధ మతము|బౌద్ధ]] కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి<ref>{{cite web |url=http://kalachakranet.org/kalachakra_tantra_history.html |title=Kalachakra History |accessdate=2008-06-15 |date=2006-07-29 |work=International Kalachakra Network}}</ref>
 
 
"అవతారం" అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన (అవతరించిన) రూపం. [[గరుడ పురాణం]]లో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. [[భాగవతం|భాగవత పురాణం]]లో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి. మొత్తం 25 అవుతాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం "ధూమకేతువు వంటి [[ఖడ్గం]] చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు" మూర్తిగా వర్ణిస్తారు.
 
 
పంక్తి 16:
 
 
'''విష్ణు పురాణం''' - వేదోక్త ధర్మ విధులు క్షీణించినపుడు కలికాలాంతం సమీపిస్తుంది. అపుడు విరాట్పురుషుడు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయశుని ఇంట అవతరిస్తాడు. తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేస్తాడు. దర్మాన్ని పునరుద్ధరిస్తాడు. జనులు సన్మార్గాన్ని అనుసరించ మొదలు పెడతారు. అలాంటివారి సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. [[సూర్యుడు]], [[చంద్రుడు]], and the lunar asterism Tishya, [[బృహస్పతి]] ఒకే [[రాశి]]<nowiki/>లో ఉన్నపుడు కృతయుగం ఆరంభమవుతుంది.(4-24)
 
 
"https://te.wikipedia.org/wiki/కల్క్యావతారము" నుండి వెలికితీశారు