నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
నెపోలియన్ [[ఆస్ట్రీయా]],[[ఇటలీ]] (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు.నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలఫ్రదం గా ఉపయోగపడింది.అప్పటివరుకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీ లో రాజకీయపుర్వకమయిన ఐక్యత లోపించివుండింది.అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఎర్పాటుచేసాడు.ఆ పద్దతిలో ఇటలీ లో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు.ఆస్ట్రీయా,ఇటలీ (సార్డీనియా) యుద్దాలు నెపోలియన్ యొక్క వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ యొక్క అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
[[ఫ్రాన్స్]] యొక్క శత్రువయిన [[ఇంగ్లాండు]] ను ఓడించాడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్ ను అధిపతి గా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా [[ఇంగ్లాండు]] ఓడించడం కష్టమని,[[ఇంగ్లాండు]] కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే లో దాడిచేసాడు.పిరమిడ్ యుద్దంలో విజయం సాధించినప్పటికి ,[[ఇంగ్లాండు]] నౌకధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు.నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు తిరిగివచ్చాడు.ఆ సమయంలో [[ఫ్రాన్స్]] ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది.
ఈ పాలకమండలి లో ఐక్య కొరవడింది.శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని , డైరెక్టరీ కిఅ శాశనసభ కు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు.తగాదాలు,కుట్రలతో పాటుగా సాంఘీక ఆర్ధిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి.డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది.[[ఫ్రాన్స్]] యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది.ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు.పటిష్టమయిన ,సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు.అదే సమయానికి నెపోలియన్ [[ఫ్రాన్స్]] చేరి సైన్యం తో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు.నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత,కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు.ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.
===మొదటి కౌన్సిల్ గా నెపోలియన్ సంస్కరణలు===
నెపోలియన్ [[ఫ్రాన్స్]] కు వ్యతిరేకంగా వున్న [[ఇంగ్లాండు]],[[ఆస్ట్రీయా]] ల తో సంధులు కుదుర్చుకొని యుద్దాలనుండి [[ఫ్రాన్స్]] ను కాపాడి శాంతి ఏర్పరిచాడు.అనంతరం [[ఫ్రాన్స్]] ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన కాలాన్ని వినియోగించాడు.ప్రజల మధ్య సాంఘీక,ఆర్దిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు.కాని స్వేచ్చ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు.నెపోలియన్ దృష్టీ లో "[[ఫ్రాన్స్]] ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్చ కాదు".దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటకు ప్రయత్నించాడు.
===సంస్కరణలు===
===మత సంస్కరణలు===
"ప్రజలకు కావలిసినది మతం,కాని ఆ మతం ప్రభుత్వ ఆధినంలో వుండాలి"
విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయిన [[పోప్]] తో ఒప్పందం కుదుర్చుకొని [[ఫ్రాన్స్]] లో మతాచార్యుల నిర్వాహణ భాద్యతలను నెపోలియన్ స్వీకరించాడు.చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధినపరుచుకొనుటకు పోప్ అంగీకరించాడు.మతాచార్యులను ప్రభుత్వం నియమిస్తే వారిని పోప్ అనుమతిస్తాడు.వారంతా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాలి.
===న్యాయ సంస్కరణలు===
[[ఫ్రెంచి విప్లవం]] కు మునుపు [[ఫ్రాన్స్]] లో నిర్ణీత న్యాయవ్యవస్థ లేదు.విభిన్న న్యాయవిధానములు అమలులో ఉండేవి.నెపోలియన్ విటన్నింటిని క్రోడికరించి, ప్రఖ్యాత న్యాయవేత్తల సహాయంతో నెపోలియన్ న్యాయస్మృతిని రూపొందించాడు.దీనిని సివిల్,క్రిమినల్,వాణిజ్య స్మృతులుగా విభజించారు.
నెపోలియన్ రూపొందించిన న్యాయస్మృతి వల్ల ప్రజలకు స్థిరమయిన,క్రమమయిన న్యాయం లభించుటకేగాక,త్వరగాను,తక్కువ ఖర్చుతోనూ,విశ్వాసపాత్రమయినదిగాను లభించింది.
===ఆర్ధిక సంస్కరణలు===
[[ఫ్రెంచి విప్లవం]] సంభవించుటకు ఆర్ధిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.[[ఫ్రాన్స్]] దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు.దేశ మొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయం లో దుబారా తగ్గించాడు.దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు.నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు.1800 వ సంవత్సరం లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు.నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు