శాంతా రంగస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
[[1954]], [[జనవరి 1]]న [[మద్రాసు]] ([[చెన్నై]]) లో జన్మించిన '''శాంతా రంగస్వామి''' (Shantha Rangaswamy) [[భారతదేశం|భారతదేశపు]] మహిళా [[క్రికెట్]] క్రీడాకారిణి. [[1976]] నుంచి [[1991]] మధ్యకాలంలో ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. 1976-77 లో 8 టెస్టులకు మరియు 1983-84 లో 4 టెస్టులకు ఆమె నాయకత్వం కూడా వహించింది. 1981-82 నుంచి 1986 మధ్యకాలంలో ఆమె 19 వన్డే మ్యాచ్‌లను ఆడింది. అందులో 16 వన్డేలకు నేతృత్వం వహించింది.
 
కుడిచేతితో బ్యాటింగ్ చేసే శాంతా రంగస్వామి టెస్టులలో 32.6 సగటుతో మొత్తం 750 పరుగులు సాధించింది. ఇందులో [[న్యూజీలాండ్]] పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది.<ref>http://www.cricinfo.com/db/ARCHIVE/1970S/1976-77/OTHERS+ICC/IND-WOMEN_IN_NZ/IND-WOMEN_NZ-WOMEN_WT_08-11JAN1977.html</ref>. ఆమె అత్యధిక స్కోరు 108 పరుగులు. బౌలింగ్ లో 16 వికెట్లు కూడా సాధించింది. [[బౌలింగ్]] లో ఆమె అత్యున్నత గణాంకము 42 పరుగులకు 4 వికెట్లు. ఇది [[ఇంగ్లాండు]] పై సాధించింది.
 
వన్డే క్రికెట్‌లో 19 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 15.1 సగటుతో 287 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో 29.41 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. [[1982]]లో [[న్యూజీలాండ్]] లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ ఆమె ప్రథమస్థానం పొందింది. ఇదే ప్రపంచ కప్ పోటీలలో న్యూజీలాండ్‌పై ఆమె వన్డేలలో ఏకైక అర్థ శతకం సాధించింది.
ప్రస్తుతం శాంతా రంగస్వామి క్రికెట్ రచయిత్రిగా పనిచేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/శాంతా_రంగస్వామి" నుండి వెలికితీశారు