పట్లోళ్ల రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== జీవిత విశేషాలు ==
రామచంద్రారెడ్డి [[1929]] [[డిసెంబర్ 3|డిసెంబరు 3]]<nowiki/>న సాధారణ వ్యవసాయ కుటుంబంలో [[సంగారెడ్డి జిల్లా]] కొండాపూర్‌ మండలం మారేపల్లి జన్మించాడు.<ref>[[మెదక్]] జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)</ref> [[హైదరాబాదు సంస్థానం]] విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళాడు. విమోచన అనంతరం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది 1956లో న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. 1959లో పటాన్‌చెరు [[పంచాయతి]] సమితి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసాడు. పల్లెసీమల అభివృద్ధికి విశేషంగా కృషిచేసినందుకు నాటి ప్రధాని [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కాంగ్రెస్‌ తరఫున ఐదుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించాడు. 1962లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా [[సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం|సంగారెడ్డి నియోజకవర్గం]] నుంచి ఎన్నికయ్యాడు.<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1962-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1962|website=www.elections.in|access-date=2018-04-30}}</ref> 1969లో ప్రత్యేక [[తెలంగాణ ఉద్యమం]]<nowiki/>లో కూడా పాలుపంచుకున్నాడు. 1972లో రెండోసారి శాసనసభకు ఎన్నికై<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1972-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1972|website=www.elections.in|access-date=2018-04-30}}</ref> కొంతకాలం రాష్ట్ర మంత్రిగానూ పనిచేశాడు. అతడు పటాన్‌చెరు ఫారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషిచేశాడు. తరువాత 1983<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1983-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1983|website=www.elections.in|access-date=2018-04-30}}</ref>, 1985<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1985-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1985|website=www.elections.in|access-date=2018-04-30}}</ref>, 1989లోనూ1989<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1989-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1989|website=www.elections.in|access-date=2018-04-30}}</ref>లోనూ గెలిచాడు. 1990 జనవరి 4 నుంచి డిసెంబరు 22 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు. [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి|నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి]] కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగాడు. 1999లో కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చాడు. 2004లో మెదక్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=571582|title=మాజీ స్పీకర్‌ రామచంద్రారెడ్డి కన్నుమూత -|website=www.andhrajyothy.com|language=te|access-date=2018-04-30}}</ref>