సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==సినిమా రంగం==
ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో [[చెన్నై|మద్రాసు]]కు వెళ్లాడు. మొదట [[ఆత్రేయ]] వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] హీరోగా తెరకెక్కిన [[కిలాడి కృష్ణుడు]] సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు<ref name=వి6 />.
 
==సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/సాహితి_(సినీ_రచయిత)" నుండి వెలికితీశారు