స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==ఖిలాఫత్ ఉద్యమ & సహాయ నిరాకరణ ఉద్యమ కాలం==
 
ఈ మేరకు తమదైన రీతిలో బ్రిటీష్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిస్పందిస్తుండగా స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన పోరాట రూపంగా భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో స్థానం సంపాదించుకుని, మహోద్రుతంగా సాగిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమం దూసుకొని వచ్చింది. భారతీయులలో పెరుగుతున్న స్వేచ్ఛా స్వతంత్ర భావాలను, ప్రజా ఉద్యమాలను అదుపుచేయడానికి, అణిచి వేయడానికి బ్రిటీషర్లు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రారంభించారు. ప్రథమ ప్రపంచ యుద్ధం సంద్భంగా ప్రపంచ ముస్లింల పవిత్ర స్థలాలకు తగిన రక్షణ కల్పిస్తామని చెప్పిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కివేస్తూ ప్రపంచ ముస్లింలంతా ఎంతగానో గౌరవించే ఖిలాఫత్‌ వ్యవస్థను రద్దు చేసింది. బ్రిటీషర్ల చర్యలకు వ్యతిరేకంగా టర్కీ దేశాధినేత కమల్‌ పాషా ప్రారంభించిన ఖిలాఫత్‌ పోరాటానికి భారతీయ ముస్లింలు మద్దతు పలికారు. ఖిలాఫత్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రారంభమైన ఖిలాఫత్‌ ఉద్యమానికి గాంధీజీ మద్దతునిచ్చారు. ఆ కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్‌ ఉద్యమం జమిలిగా భారత రాజకీయ చిత్రపటం విూద ఆవిష్కరించబడ్డాయి. 1920 ఏప్రిల్‌ 17న గాంధీజీ, ఆలీ సోదరులుగా ఖ్యాతిగాంచిన మహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీలతో కలిసి సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్న ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమ ప్రకంపనాలు అతి త్వరగా ఆంధ్రావనిని అందుకున్నాయి. తొలిసారిగా 1920 మార్చిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఖిలాఫత్‌ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రఖ్యాత తెలుగు కవి, పిఠాపురానికి చెందిన డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా అధ్యక్షత వహించారు. సభలో ముస్లిమేతర ప్రముఖులతో పాటుగా ముస్లిం ప్రముఖులు షుకూర్‌ సాహెబ్‌, నాజియా హుస్సేన్‌లు పాల్గొని బ్రిటీషర్ల విధానాలను విమర్శిస్తూ ప్రసంగించారు. 1920 ఆగస్టులో మద్రాసులో మహాత్మా గాంధీ సమక్షంలో జరిగిన సభలో ప్రముఖ ముస్లిం నాయకులు యాకూబ్‌ హుస్సేన్‌, డాక్టర్‌ లతీఫ్‌, సయ్యద్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొనగా ఖాన్‌ బహుదూర్‌ ఖుద్దూస్‌ సాహెబ్‌ సభకు అధ్యక్షత వహించారు. ఆ తరువాత 1921లో తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన మరొక సభలో అలీఘర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు మహమ్మద్‌ అబ్దుల్‌ హకీం, మహమ్మద్‌ అబ్దుల్‌ ఖయూమ్‌లు ప్రసంగించారు. ఈ సభలో భారతీయ ముస్లింల కోర్కెలను తీర్మానాలుగా రూపొందించారు. ఆ తరువాత ఉద్యమంలో పాల్గొన్నందుకు కేరళ నాయకుడు యాకూబ్‌ హసన్‌ తదితర నేతలను అరెస్టు చేసిన సంఘటనకు నిరసనగా ఏలూరులో సంపూర్ణ హర్తాల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగానే మద్రాసు నుండి ప్రచురితమౌతున్న ఖౌమీ రిపోర్టు పత్రిక సంపాదకులు అబ్దుల్‌ మజీద్‌షా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి వివిధ గ్రామాలలో పర్యటించి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ సభలు సమావేశాలు నిర్వహించారు. ముస్లిం జనసముదాయాలు అధికంగా గల ప్రాంతాలలో ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. రాయలసీమ వైఎస్ఆర్ జిల్లా తాడిపత్రికి చెందిన సులేమాన్‌ సాహెబ్‌ సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1921 నవంబరు 25న అరెస్టు చేయబడిన ఆయన ఆరు మాసాల పాటు బళ్ళారి సెంట్రల్‌ జైలులో గడిపారు. తాడిపత్రి నివాసి అబ్దుల్లా సాహెబ్‌ ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఐదు మాసాల జైలుశిక్ష పడింది. ఆయనతో పాటుగా తిరుపతి నివాసి మదార్‌ సాహెబ్‌, తాడిపత్రి చెందిన మరొకరు షేక్‌ మాలిక్‌ షక్కర్‌ బరూన్‌ పలు శిక్షలకు గురయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఖిలాఫత్‌ కమిటీ కార్యదర్శిగా హుసేన్‌ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కర్నూలులోని మౌంట్‌ రోడ్‌లో గల ఆజం కళాశాల విద్యార్థులు యాకుబ్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మజీద్‌ షరార్‌, అవిూర్‌ అలీ, బాబుహై మజహర్‌, సయ్యద్‌ మొహిద్దీన్‌ తదితర విద్యార్థులు 1920 అక్టోబరు 21న స్థానిక మసీదు వద్ద ప్రసంగిస్తూ 22నాటి విద్యార్థుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆ రోజున జుమ్మా ప్రార్థనల తరువాత జరిగిన సమావేశంలో సయ్యద్‌ మొహిద్దీన్‌, అమార్‌ అలీ అబ్దుల్‌, మజహర్‌ అను విద్యార్థినాయకులు సహాయనిరాకరణ అంశం విూద ప్రసంగించారు. ఈ విద్యార్థి నాయకులు కళాశాలల బహిష్కరణకు ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన కన్పించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు కూడా కళాశాలలను బహిష్కరించారు. ఆ విధంగా గవర్నమెంటు కాలేజీ చదువులకు స్వస్తి చెప్పిన విద్యార్థులలో కరీంనగర్‌కు చెందిన విూర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, హైదరాబాద్‌కు చెందిన అక్బర్‌ ఆలీఖాన్‌, ఇంకా సయ్యద్‌ మహమ్మద్‌ ఆలీ, మక్బూల్‌ ఆలీ, మహమ్మద్‌ హుస్సేన్‌ యూసువుద్దీన్‌, హమీదుద్దీన్‌ మహమూద్‌, ఫక్రుద్దీన్‌ మసూద్‌, సయ్యద్‌ మహమ్మద్‌ అన్సారీ తదితరులు ఉన్నారు. ([[నవ్యాంధ్రము నా జీవిత కథ -నవ్యాంధ్రము]], అయ్యదేవర కాళేశ్వరరావు, పేజీ 327). అలీఘర్‌ జాతీయ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఖిలాఫత్‌- సహాయ నిరాకరణోద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చారు. మౌలానా ముహమ్మద్‌ అలీ మార్గదర్శకత్వంలో ముహమ్మద్‌ హుస్సేన్‌, షఫిఖ్‌ రహమాన్‌ కిద్వాయ్‌ తదితరులు ఆంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాలలో పనిచేసేందుకు వచ్చి అదోని చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాలల్లో పాల్గొంటుండగా ఆ విద్యార్థులను [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] స్వయంగా కడపకు పిలిపించారు.
 
=== కడప లో ఉద్యమ రూపం ===