వికీపీడియా:ఆటోమాటిగ్గా నిర్ధారించబడిన వాడుకరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Replaced content with 'వికీ పీడియా కోసం రచనలు చేసే వారు,తర్జుమాలు చేసే వారు,లేదా త...'
ట్యాగు: మార్చేసారు
పంక్తి 1:
వికీ పీడియా కోసం రచనలు చేసే వారు,తర్జుమాలు చేసే వారు,లేదా తప్పులు సరిదిద్దే వారి ఈమెయిలు కు ఒక సారి లింక్ ను పంపి వారి ఈమెయిలు ను సరి చూసు కున్నపుడు వారిని ఆటోమేటిక్ గా నిర్ధారించబడిన వాడుకరులుగా పిలవడం జరుగుతుంది.
శ్రీ వేంకటేశ దండకం
జయ వేంకటేశం, శ్రీశ్రీనివాసం, శ్రితపారిజాతం, గరుడాద్రివాసం, భక్తజనమందారం, కమనీయరూపం, కందర్పకోటిసదృశం, అఖిలభువనజన్మస్థేమభంగాదిలీలం, వేంకటాద్రికల్పతరుంబటంచు నీ నామసంకీర్తనముల్ జేయుచున్, సన్మంగళాలననుగ్రహించు నీ దివ్యదర్శనంబు మహాభాగ్యమటంచు స్వయంవ్యక్తమైనట్టి నీ అర్చారూపమున్ దలంచినంతనే సకలపాపముల్ తొలగునే, సర్వసౌభాగ్యముల్, ఆనందముల్, సంపదల్ గల్గునే, ఓ దుష్టసంహార! ఓ దురితదూర! గోవిందాయన్నంతనే వాత్సల్యపూరితంబైన అభయహస్తమునన్ నీ దివ్యపాదారవిందముల్ దర్శింపజేయుచున్ సంసారసాగరంబు మోకాలిబంటని దెల్పి కటాక్షించు నిన్నున్ పొగడంగ నేనెంత వాడన్, అజ్ఞానముతో జేసినన్ తప్పులన్ మన్నించు పరమదయాళువైన శ్రీవేంకటేశ నీకు మ్రొక్కెదన్. తొల్లి భృగుమహర్షి కారణంబునన్ వైకుంఠమున్ విడచి అమ్మవారినిన్ వెదుకుచున్ శ్రీనివాసుండవై, వివిధ పుష్పవృక్షమృగసమూహంబులచే సమస్తతీర్థంబులచే నిండియున్నట్టి భూలోకవైకుఠంబైయున్న వరాహక్షేత్రంబుకేతెంచి, వల్మీకంబునన్ వసించియుండంగ, ధేనురూపుండైన యా బ్రహ్మచే క్షీరాభిషేకమున్ బొంది, నీలాలనిచ్చినట్టి యా నీలాదేవియున్ నీలాద్రిగా కటాక్షించి, వకుళమాతయుననుగ్రహించి, ఆకాశరాజు కూతురైనట్టి యా పద్మావతీదేవినిన్ బెండ్లాడి, వరాహస్వామికిన్ ప్రథమనివేదనంబిచ్చు నిర్ణయంబున్ జేసి, వేంకటాద్రిశిఖరంబునన్ విరజాతుల్యంబగు స్వామిపుష్కరిణి తీరవాసివై లక్ష్మీసమాశ్లిష్టభుజాంతరుండవై తొండమానుని ఆనందనిలయంబు ప్రవేశించి, అభిషేకఘట్టమున్ దలచినంతనే యా విప్రుని భార్యాపుత్రులన్ జీవింపజేసి వేంకటాచలమునన్ లీలామానుషవిగ్రహుండవై, భక్తసులభుండవై వివిధ దేవతా-మహర్షి బృందములచే సేవింపబడుచున్, దయామృతంబైన దివ్యవీక్షణలచే నిన్నున్ సేవించినట్టి యా నారాయణుండనంతాళ్వారు, కురువరనంబి, తిరుమలనంబి, వెంగమాంబ, అన్నమయ, హాథీరాంబాబాజీ మొదలగు భక్తాగ్రేసరులననుగ్రహించుచున్, అపార-కారుణ్య-ఔదార్య-వాత్సల్య-సౌశీల్య-స్వామిత్వ-సౌలభ్యాద్యనంతకళ్యాణగుణాకరంబైనట్టి నీ అప్రాకృతదివ్యరూపమున్ గొలచి దలంచినంతనే కామితార్థములన్ దీర్చుచున్, బ్రాహ్మీముహూర్తమునకున్ బూర్వమే కౌసల్యా సుప్రజారామయటంచు ఆ హస్తగిరి అణ్ణన్ జేసిన స్తోత్రంబుచే మేల్గాంచి, రేఖామయధ్వజసుధాకలశాతపత్రవజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రంబులచే అలంకృతంబులైన నీ దివ్యచరణంబులన్ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యేయని ప్రపత్తితో ఆశ్రయింప సుప్రభాతంబునన్ విశ్వరూపదర్శనంబిచ్చి, యా బ్రహ్మతీర్థంబునన్ సమస్తులన్ పునీతులంజేసి, ఆళ్వారు స్తోత్రంబులగు దివ్యప్రబంధపాశురముల్ బఠింప కిరీటాది పాదపర్యంతంబలంకృతంబైన పూమాలలచే తోమాలసేవలో పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళంబటంచు సమ్మోహనంబైన నీ దివ్యదర్శనంబునన్ సకల దుఃఖములన్ దొలగించి, ఆస్థానమునన్ నవరత్నఖచితబంగారుసింహాసనంబునన్ సర్వలోకాలకధినాయకుండగు కొలువు శ్రీనివాసుండవై, నీ దివ్యస్వరూపంబున్ దెల్పు పురాణాంతర్గతంబైయున్న దివ్యనామంబుల సహస్రనామార్చనంబునన్ ఉరమునున్న లక్ష్మీదేవితో గలిసి నీలమేఘుండవై కమనీయ దర్శనంబిచ్చి, ప్రాతర్మాధ్యాహ్నికసాయంకాల నివేదనంబులచే తోమని పళ్ళాలవాడిగా వాసికెక్కి, జో అచ్యుతానందయటంచు బంగారుమంచంబుపై పట్టుపాన్పునన్ నిన్నున్ బవళింపజేయు ఏకాంతసేవనున్ శయనవైభవమున్ ప్రకటించుచున్, సోమవారపు చతుర్దశకలశంబుల విశేషపూజలో భక్తులన్ బ్రోవ, మంగళవారాష్టోత్తరశతనామంబుల అష్టదళపాదపద్మారాధనంబునన్ విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సయని స్తుతింపబడిన నీ దివ్యపాదమహిమన్ దెల్పుచున్, బుధవార సహస్రకలశాభిషేకంబునన్ భోగశ్రీనివాసుండవై, గురువార తొలిసంధ్య తిరుప్పావడనన్, మలిసంధ్య పూలంగిన నేత్రదర్శనంబిచ్చి, వేదవేద్యుండవైన నీకున్ జగన్మాతకున్ వేదపారాయణంబునన్ జరుగు కస్తూరి పునుగు దివ్యపరిమళాల శుక్రావారాభిషేకంబునన్ సర్వాలంకారభూషితుండవై సిరులననుగ్రహింపజేయుచున్, రోహిణీ నక్షత్రంబునన్ రుక్మిణీసత్యభామా- సహితుండైన వేంకటాద్రి కృష్ణుండవై, పునర్వసునన్ జానకీలక్ష్మణోపేతుండగు వేంకటాద్రి రాముండవై, శ్రవణంబునన్ శేషభూధరంబున వేంచేసిన శ్రీవేంకటేశుండవై, చైత్రమాస వసంతోత్సవంబునన్, జ్యేష్టంబునన్ జరుగు జ్యేష్టాభిషేకంబున వజ్ర-ముత్యంగి-సువర్ణకవచమునన్ అనుగ్రహించుచున్, శ్రావణమాస పవిత్రోత్సవంబునన్ సర్వదోషంబుల్ దొలగించుచున్, ధనుర్మాసమునన్ గోదాసమర్పిత పూమాలలచే శ్రీరంగనాథుండవై, కైశికద్వాదశినన్ ఊరెరిగింపునన్ ఉగ్రశ్రీనివాసుండవై, భక్తజనోద్ధరణకై బ్రహ్మోత్సవంబున శేషాదివివిధ వాహనంబుల విశేషాలంకారంబునన్ మలయప్పస్వామియై విశేషతత్త్వమ్ము దెలుపుచున్, నిత్యకళ్యాణం పచ్చతోరణంబైనట్టి తిరుమల దివ్యక్షేత్రంబునన్ వైఖానసవిధానంబునన్ జరుగు నిత్యోత్సవ-పక్షోత్సవ-మాసోత్సవ-నక్షత్రోత్సవ-సంవత్సరోత్సవాది ఉత్సవవిశేషంబులన్ కలియుగ ప్రత్యక్షదైవంబువై దివ్యమంగళ అతృప్త్యామృతరూపమున్ దర్శింపజేయుచున్ నిజభక్తి నమ్మిన వారలననుగ్రహించు కొండలరాయుండా వేంకటేశు సమమైన దైవంబు లేడనుచున్ అలమేలుమంగపతి అంఘ్రిద్వయంబు శరణంబు వేడెదెన్.
*****
పైడిపాటి వేంకటాచలపతి
ధర్మగిరి, తిరుమల
[[ప్రత్యేక:చేర్పులు/117.204.52.172|117.204.52.172]] 10:27, 14 ఏప్రిల్ 2018 (UTC)