నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
===ఆర్ధిక సంస్కరణలు===
[[ఫ్రెంచి విప్లవం]] సంభవించుటకు ఆర్ధిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.[[ఫ్రాన్స్]] దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు.దేశ మొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయం లో దుబారా తగ్గించాడు.దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు.నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు.1800 వ సంవత్సరం లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు.నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.
===నెపోలియన్ చక్రవర్తి అగుట===
మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.డిసెంబరు2, 1804 న [[పోప్]] చేత నెపోలియన్ చక్రవర్తి గా పట్టాభిషక్తుడైనాడు.
[[ఫ్రాన్స్]] లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.
===చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు===
[[ఫ్రాన్స్]] చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా ఐరోపా చిత్రపటమును తిరిగి గీయించాడు.ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు.
పరోక్ష యుద్దంలో ఇంగ్లాండు ను ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు.ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు.తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి.పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది.అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు.తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి [[రష్యా]],[[పోర్చుగల్]],[[స్పెయిన్]] దేశాలమీద యుద్దాలు ప్రకటించవలసివచ్చింది.ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి.
నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు