నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''నెపోలియన్ బోనపార్టీ''' 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియా లో ,ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, [[పారిస్]] లో చదువుకున్నాడు.అతనికి [[చరిత్ర]],[[రాజనీతి శాస్త్రం]],గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది.నెపోలియన్ మీద [[రూసో]] ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్ గా నియమితుడయ్యాడు.
===సైనిక జీవితం===
1792 లో [[ఫ్రెంచి విప్లవం]] జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకొవడానికి ఆంగ్ల నౌకాదళం [[ఫ్రాన్స్]] మీద దాడి చేసింది.నెపోలియన్ వారిని సమర్దవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్ గా పదొన్నతిని కల్పించారు.1795 అక్టోబరు లో [[ఫ్రాన్స్]] ప్రజలు జాతీయ సమావేశానికి కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ,రాజరిక వాదుల నుండీ రాజ్యాంగమును రక్షించుటలో మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతి గా నియమించారు.
 
===సైనికాధిపతిగా నెపోలియన్ విజయాలు===
నెపోలియన్ [[ఆస్ట్రీయా]],[[ఇటలీ]] (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు.నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలఫ్రదం గా ఉపయోగపడింది.అప్పటివరుకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీ లో రాజకీయపుర్వకమయిన ఐక్యత లోపించివుండింది.అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఎర్పాటుచేసాడు.ఆ పద్దతిలో ఇటలీ లో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు.ఆస్ట్రీయా,ఇటలీ (సార్డీనియా) యుద్దాలు నెపోలియన్ యొక్క వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ యొక్క అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు.
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు