నెపోలియన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
[[ఫ్రాన్స్]] లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.
===చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు===
[[ఫ్రాన్స్]] చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా [[ఐరోపా]] చిత్రపటమును తిరిగి గీయించాడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు.
పరోక్ష యుద్దంలో ఇంగ్లాండు ను ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు. తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి [[రష్యా]],[[పోర్చుగల్]], [[స్పెయిన్]] దేశాలమీద యుద్దాలు ప్రకటించవలసివచ్చింది. ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి.
నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.[[స్వీడన్]],[[రష్యా]],[[ఆస్ట్రియా]] లతో అప్పటి [[ఇంగ్లాండు]] ప్రధానమంత్రి పిట్ ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా [[ఫ్రాన్స్]] వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది.
కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ [[ఆస్ట్రియా]] మీదకు సైన్యాలను పంపించి ఆస్టర్ విడ్జీ వద్ద [[రష్యా]], [[ఆస్ట్రియా]] సైన్యాల మీద ఘనవిజయం సాధించాడు. ఈ యుద్దం తో మూడవ కూటమి విచ్చిన మగుటయే కాక ఆస్ట్రియా అవమానకరమైన ప్రెస్ బర్గ్ సంధికి అంగీకరించవసివచ్చింది. ఈ సంధి తో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది.
ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని [[రష్యా]] మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్దంలో రష్యన్ సైన్యాలపై గప్ప విజయం సాధించి,నాటి రష్యా చక్రవర్తి జార్ తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్ ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీ లో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.[[స్పెయిన్]],[[ఫ్రాన్స్]] కు సామంత రాజ్యంగా కుదించబడింది. [[స్పెయిన్]] పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.[[పోర్చుగల్]] కూడా [[స్పెయిన్]] ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.[[జర్మనీ]]
"https://te.wikipedia.org/wiki/నెపోలియన్" నుండి వెలికితీశారు