నికోలా స్టర్జన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
'''నికోలా ఫెర్గసన్ స్టర్గియాన్''' (జననం 19 జులై 1970) ప్రముఖ స్కాటిష్ రాజకీయవేత్త. ఆమె ప్రస్తుతపు స్కాటిష్ మొదటి మంత్రి(రాష్ట్రపతికి సమానమైన పదవి). నవంబరు 2014 నుంచి నికోలా స్కాటిష్ జాతీయ పార్టీకి నాయకురాలిగా పనిచేస్తోంది. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ ఈమే. నికోలా 1999 నుంచి, స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఉంది. ఆమె మొట్టమొదట 1999 నుంచి 2007 వరకు [[గ్లాస్గో]] నియోజకవర్గానికి అదనపు శాసనసభ సభ్యురాలిగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత గ్లాస్గో దక్షిణ నియోజకవర్గానికి(2007-2011 వరకు గ్లాస్గో గోవన్ నియోజకవర్గంగా ప్రసిద్ధం) సభ్యురాలిగా ఉంటోంది.
 
నికోలా, గ్లాస్గో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించింది. [[గ్లాస్గో]]లో న్యాయవాదిగా కూడా కొన్నాళ్ళు పనిచేసింది. స్కాటిష్ పార్లమెంట్ లో సభ్యురాలిగా ఎన్నికైన తరువాత, స్కాటిష్ నేషనల్ పార్టీకి చాలా ఏళ్ళు విద్య, ఆరోగ్య, న్యాయ శాఖలకు ఛాయా మంత్రిగా ఎంతో కృషి చేసింది. 2004లో ఆ పార్టీ నాయకుడు జాన్ స్విన్నే రాజీనామా చేసిన తరువాత, ఆ స్థాననికి తాను నిలబడతానని ప్రకటించింది. అయితే నికోలా తరువాత, అలెక్స్ సాల్మండ్ కు అనుకూలంగా, తన అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసుకుంది. అలెక్స్దానికి నాయకునిగాబదులుగా ఎన్నికైనసహ తరువాత,నాయకురాలి ఆమెస్థానానికి సహపోటీ నాయకురాలిగా పనిచేసిందిచేసింది.
 
అలెక్స్, నికోలాలు ఎన్నికైన తరువాత, ఆమె సహ నాయకురాలిగా పనిచేసింది. 2004 నుంచి 2007 వరకు పార్టీని నడిపించింది ఆమె. 2007 సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అలెక్స్ సాల్మండ్ స్కాట్లాండ్ కు మొదటి మంత్రి, ఆరోగ్యం, సంక్షేమ శాఖ క్యాబినెట్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2012లో నికోలా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, నగరాల శాఖకు క్యాబినేట్ కార్యదర్శిగా నియమింపబడింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నికోలా_స్టర్జన్" నుండి వెలికితీశారు