ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

జార్జి ఈస్ట్మన్ చిత్రం
→‎చరిత్ర: పూర్వాపరాలు
పంక్తి 30:
 
== చరిత్ర ==
 
=== పూర్వాపరాలు ===
ఏప్రిల్ 1880 లోనే జార్జి ఈస్ట్‌మన్‌ రోచెస్టర్ లో ఒక గదిని అద్దెకు తీసుకొని అప్పటి తరం కెమెరాలకు కావలసిన డ్రై ప్లేట్ లను వాణిజ్య విక్రయాలకై రూపొందించటం మొదలు పెట్టాడు. జనవరి 1881లో హెన్రీ ఏ స్ట్రాంగ్ అనే వ్యాపారవేత్త భాగస్వామిగా ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ కంపెనీ ని స్థాపించారు. రోచెస్టర్ లో బ్యాంకులో తాను చేస్తున్న ఉద్యోగానికి ఈస్ట్‌మన్‌ రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ కంపెనీలోనే పనిచేయటం ప్రారంభించాడు. 1884 లో స్ట్రాంగ్ తో భాగస్వామ్యం పూర్తయింది. పధ్నాలుగు మంది వాటాదారులతో ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ అండ్ ఫిలిం కంపెనీ ఏర్పడింది. కేవలం నిపుణులకే పరిమితం కాకుండా, సామాన్యులు కూడా ఉపయోగించే కెమెరాలను ఈస్ట్‌మన్‌ డ్రై ప్లేట్ అండ్ ఫిలిం కంపెనీ తయారు చేసింది. 1885లో జార్జి ఈస్ట్‌మన్‌ డేవిడ్ హూస్టన్ నుండి ఫిలిం చుట్ట యొక్క పేటెంటులను కొనుగోలు చేసి దానికి మరిన్ని మెరుగులు దిద్దారు. ఈ మెరుగులే తర్వాత మోషన్ పిక్చర్ ఫిలిం తయారు చేయటానికి దారులు వేశాయి.
 
1888లో జార్జి ఈస్ట్‌మన్‌ కొడాక్ ను స్థాపించినప్పటి నుండి పలు కెమెరాలు, ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు మరియు ఫోటోగ్రఫిక్ కాగితం ను సామాన్యుడు సైతం కొనగలిగే స్థాయిలో అందుబాటులోకి తెచ్చి వాటిపై భారీ లాభాలను అర్జించింది. 1976వ సంవత్సరం నాటికి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లో ఫిలిం విక్రయాలలో 90%, కెమెరా విక్రయాలలో 85% కొడాక్ యే ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు