ఈస్ట్‌మన్ కొడాక్: కూర్పుల మధ్య తేడాలు

→‎స్థాపన: విస్తరణ
→‎స్థాపన: విస్తరణ
పంక్తి 41:
1888 లో ఈస్ట్‌మన్‌ కొడాక్ ప్రారంభమైంది. మొట్టమొదటి కొడాక్ కెమెరా రూపు దిద్దుకొంది. 2.5 ఇంచిల వ్యాసం గల, 100 ఫ్రేముల ఫిలిం చుట్టను తనలో ఇముడ్చుకోగల ఫిక్స్డ్ ఫోకస్ కెమెరా అది. ఈ కెమెరా ఔత్సాహిక ఫోటోగ్రఫర్లకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది. దీనికి ముందు ఫోటోగ్రఫీ, పరికరాలు మరియు ప్రక్రియ చాలా భారీగా ఉండి, ఫోటోగ్రఫీని ఒక శాస్త్రాన్ని తలపింపజేసేది. కానీ ఈ కెమెరాతో ఫోటోగ్రఫీ ఒక వినోద సాధనం అయింది.
 
మొదటి ఫిలిం చుట్ట కాగితం ముడి పదార్థం గా చేయబడగా, తర్వాతి పారదర్శక చుట్టలు సెల్యులోజ్ తో చేయబడ్డవి. మొదటి తరం ఫిలిం ల లోడింగ్/అన్ లోడింగ్, డార్క్ రూంలలోనే చేయబడేవి. తర్వాత వచ్చిన కార్ట్రిడ్జ్ సిస్టంతో వెలుపల కూడా ఫిలిం ను లోడ్ చేయగల సౌలభ్యం కలిగింది.
 
అప్పటి నుండి పలు కెమెరాలు, ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు మరియు ఫోటోగ్రఫిక్ కాగితం ను సామాన్యుడు సైతం కొనగలిగే స్థాయిలో అందుబాటులోకి తెచ్చి వాటిపై భారీ లాభాలను అర్జించింది. 1976వ సంవత్సరం నాటికి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లో ఫిలిం విక్రయాలలో 90%, కెమెరా విక్రయాలలో 85% కొడాక్ యే ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ఈస్ట్‌మన్_కొడాక్" నుండి వెలికితీశారు