వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

Created page with '==అనువాద సమస్యలు== * మరియు అన్న పదం చాలామార్లు వస్తోంది. ఆంగ్లం...'
 
పంక్తి 11:
* భూతకాలాన్ని వర్తమాన కాలంలో రాయడం ఒకటి బాగా కనిపిస్తోంది. దీన్ని సరిజేయాలి. చరిత్రను రాసేప్పుడు గుర్తుపెట్టుకుని మరీ భూతకాలంలోనే రాయాలి.
** ఉదాహరణకు ''పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా '''ఉన్నాయి.''''' అని రాశారు కదా. ఐతే ఉన్నాయి అన్న క్రియ ప్రస్తుతం ఉన్నాయన్న అర్థాన్ని, వర్తమాన కాలాన్ని సూచిస్తూంది. మనం చెప్పే విషయం వందల ఏళ్ళ క్రితానిది కాబట్టి భూతకాల క్రియ వాడాలి. అంటే ''పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా '''ఉండేవి''''' అని రాయాలి.
* "యొక్క" అనే పదాన్ని తరచు వాడుతున్నారు. యొక్క అన్న పదం వాడుక భాషలోనూ, పూర్వపు గ్రాంథిక భాషలోనూ కూడా లేదు, సరికాదు. సాధారణంగా సమాసంలోకి వెళ్ళిపోతుంది. అంటే నా యొక్క భార్య, అతని యొక్క ఆస్తి అని మనం అంటామా? నా భార్య, అతని ఆస్తి అన్నది కదా ప్రయోగం. [[సరస్వతీ నది]] వ్యాసంలో ఋగ్వేదం యొక్క శ్లోకాలలో అని రాశారు, ఋగ్వేద శ్లోకాల్లో అంటే సరిపోతుంది, సరిగా ఉంటుంది. ఇలా అనవసరంగా యొక్క అన్న పదాన్ని ఎన్నోచోట్ల వాడుతున్నారు. అన్నిచోట్లా తీసి సమాసం ఏర్పరచాలి.
 
== అక్షరదోషాలు ==
* అక్షరదోషాలు ఉన్నాయి. వీటి విషయమై ప్రత్యేక వివరణ అక్కరలేదు. ఒకమారు వ్యాసం భద్రపరిచాకా, బయటి పాఠకుల్లా పైనించి కింద దాకా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే పంటికింద రాళ్ళలాగా తగులుతాయి దిద్దేయడమే.