రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన పథకమే '''రైతుబంధు పథకం'''.<ref name="రైతు బంధు పథకానికి నిధులు విడుదల">{{cite news|title=రైతు బంధు పథకానికి నిధులు విడుదల|url=https://www.ntnews.com/telangana-news/telangana-govt-sanctioned-funds-to-rythu-bandhu-pathakam-1-1-562893.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.
==వివరాలు==
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. [[ఖరీఫ్]], [[రబీ]] సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం 1.43 కోట్ల ఎకరాలకు )<ref name="పంట నిల్వకు రైతు బంధు పథకం..">{{cite news|title=పంట నిల్వకు రైతు బంధు పథకం..|url=https://www.ntnews.com/LatestNews-in-Telugu/telangana-state-to-introduce-rythu-bandhu-scheme-1-1-513189.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు.
"https://te.wikipedia.org/wiki/రైతుబంధు_పథకం" నుండి వెలికితీశారు