ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
సంప్రదాయికంగా ''ఈద్-ఉల్-ఫితర్'' రంజాన్ మాసంలోని 29వ రోజున సూర్యాస్తమయానంతరం నెలవంక మొట్టమొదట కనిపించిన సమయం నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ రంజాన్ మాసపు 29వ తేదీన మబ్బులు అడ్డుపడడం వల్ల కానీ, చంద్రోదయ సమయంలో కూడా పశ్చిమాకాశం ఇంకా ప్రకాశవంతంగా ఉండడం వల్ల కానీ సూర్యాస్తమయం అయిన వెంటనే నెలవంక కనిపించకుంటే ''ఈద్-ఉల్-ఫితర్'' ఆపై వచ్చేరోజున జరుపుకుంటారు.
== చరిత్ర ==
''ఈద్-ఉల్-ఫితర్‌''ను ఇస్లాం ప్రవక్త [[ముహమ్మద్ ప్రవక్త|ముహమ్మద్]] ప్రారంభించాడు. ముస్లిములు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ మాసం ముగిశాకా షవ్వల్ నెల మొదటి రోజున ''ఈద్-ఉల్-ఫితర్'' జరుపుకుంటారు.<ref>{{cite book|last=Ghamidiఘమిది|first=Javedజావేద్ Ahmadఅహ్మద్|title=Mizan''మీజాన్: A Comprehensiveకాంప్రహెన్సివ్ Introductionఇంట్రడక్షన్ toటు Islamఇస్లాం''|publisher=Alఅల్-Mawridమవ్రిద్|location=Lahoreలాహోర్|language=ఆంగ్లం}}</ref>
 
కొన్ని సంప్రదాయాల ప్రకారం, ఈ పండుగలు [[హిజ్రత్|ముహమ్మద్ మక్కా నుంచి వలస వెళ్ళాకా]] [[మదీనా]]లో ఉండగా ప్రారంభమయ్యాయి. అనస్ చెప్పేదాని ప్రకారం:
 
<blockquote>ప్రవక్త మదీనా చేరుకున్నాకా, ప్రజలు ఉల్లాసం కోసం, సేదదీరడానికి రెండు ప్రత్యేకమైన రోజుల్లో వేడుక చేసుకుంటున్నట్టు గ్రహించాడు. అతను ఈ పండుగల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నించాడు, వారు ఈ రోజులు సరదా, విశ్రాంతి వంటివి పొందేందుకు సందర్భాలని చెప్పారు. అందుకు ప్రవక్త వారికి బదులిస్తూ- భగవంతుడు వీటి బదులు, ఇంతకన్నా మెరుగైన రెండు (పండుగ) రోజులు: ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అదా నిర్ణయించాడని చెప్పాడు.<ref>అహ్మద్ ఇబ్న్ హన్‌బల్, ముస్నద్, vol. 4, 141–142, (సంఖ్య. 13210).</ref></blockquote>
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు