క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

→‎క్షత్రియ జాతుల వివరణ: రాయల్ క్షత్రియులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎క్షత్రియ జాతుల వివరణ: క్షత్రియ రాజులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
'''రాజపుత్రులు''': ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు. వీరికి గుజ్జారులతోనూ, ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.
 
'''రాజులు:''' ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే  క్షత్రియ రాజులు అని అంటారు. వీరు విష్ణుకుండినులు, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, కళింగ ,చోళులు ,చాళుక్యులు, పల్లవుల ,శాతవాహన ,కాకతీయుల ,సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ, జైన మత గ్రంథాల ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తా ఆంధ్రకు వలస వచ్చారు.నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాళయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.
 
'''మణిపురి క్షత్రియులు''': వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ మరియు మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు