ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి లంకె సవరణ చేసాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 126:
 
== విశేషాలు ==
ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. [[భారతదేశం]]లోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245</ref> ఇది [[హైదరాబాదు]] నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది [[శ్రీశైలం|శ్రీశైలానికి]] పశ్చిమ ద్వారంగా భావింపబడింది. ([[సిద్ధవటం]], [[త్రిపురాంతకము|త్రిపురాంతకం]], [[ఉమామహేశ్వరం]]లు [[దక్షిణ]], [[తూర్పు]], [[ఉత్తర]] ద్వారాలుగా భావింపబడినాయి). [[తుంగభద్ర]], [[కృష్ణా నది|కృష్ణా]] నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే!
===ఆలయములు===
 
====తారక బ్రహ్మాలయము====
ఈ ఆలయము గోపురములు శిధిలమై పోయినవి. ఇందలి గోడలపై అద్భుతమైన శిల్పములు కలవు. ఇందొక ముఖమండపము, దానివెనుక ఒక ప్రవేశమంటపము, దానిని చేరి గర్భాలయము ఉన్నవి.ప్రవేశమంటపము చుట్టును సన్నను వసారా కలదు.దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.ఆలయములో స్థంభములు బలిష్ఠముగా కట్టాబడినవి.
 
====శూలక బ్రహ్మాలయము====
ఈదేవళము ప్రాజ్ముఖముగా ఉన్నది. దీని యెదుట ఒక ప్రాంగణము కలందు (Portico). అటుపై ఒక వసార ప్రవేశ మంటపము కలదు. దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.పిమ్మట అంతరాళమంటపము, అటుపై గర్భాలయము కలవు.ఈ గుడిలో ఒక వేదికపై లింగము ప్రతిష్ఠింపబడినది. ఈవేదికకు నాలుగు వైపులను రాతిస్థంభములు కలవు. వేదిక చుట్టూన్న ప్రదేశము రెండవ ప్రదక్షిణ మార్గముగా కలదు.ఈ ఆలయములో తాండవనృత్యము చేయు శివుని విగ్రహ శిల్పము, ప్రణయగోష్ఠిలో నున్న గంధర్వ దంపతుల బొమ్మలు కలవు.
 
====కుమార బ్రహ్మాలయము====
ఈ ఆలయము ఒక రాతిచపటాపై ప్రాజ్ముఖముగా నిర్మింపబడినది.ఇందు ముఖమంటప్రవేశమంటపములును, వానివెనుక గర్భాలయములు ఉన్నవి. ఇచటి స్తంభములపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పములను స్మృతికి తెచ్చును.
 
====అర్క బ్రహ్మాలయము====
ఈ ఆలయము కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడినది.ఇందులో భాగమున ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి.
 
====మసీదు====
ఇది పూర్వమొక శివాలయముగా నుండెడిది. ఇందు ముఖమంటపమును, ప్రవేశమంటపమును, దీనిచుట్టును ప్రదక్షిణార్ధ ముపయోగించెడి వసారాయును, వానివెనుక గర్భాలయము ఉండెడివి. గర్భాలయములలో వేదిక ఉండెడి స్థలమున ఒక అడ్డగోడ పెట్టబడినవి. దీని కెదురుగనే నేడు మహమ్మదీయులు నమాజ్ చేయుచున్నారు. ఈకట్టడపు గోడవెలుప భాగమున నాల్గు శాసనములు చెక్కబడినవి.
 
====బాల బ్రహ్మాలయము====
అలంపురము ఆలయములలో కెల్లా ఇది ముఖ్యమైనది.ఇందు నిత్యపూజాదికములు జరుగును.తూర్పుముఖముగా నున్న ఈఆలయము నందు చిన్న నంది మంటపమును, దానివెనకల విశాలమగు ముఖమంటపము, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపము, అటుపై అంతరాళ మంటపము దానిని చేరి గర్భాలయము కలవు.గర్భాలయము చుట్టూనున్న వసార ప్రదక్షిణముకు ఉపయోగించెదరు. ఈగుడిలో భాగమున [[సప్తర్షులు]] యొక్క విగ్రహములు, ఇతర శైవదేవతల విగ్రహములున్నవి. ఈఆలయము చుట్టును చిన్నచిన్న గుడులు కలవు. ఈ ఆలయములోని లింగము వింతగా నుండును. వేదికపై నున్న శిలాలింగము మధ్యనొక బిలము కలదు. దానిలో మరియొక లింగము కలదు. పైకవచమును తీసి సవిమర్సనముగా చూచినగాని ఈఅంతర్లింగము కనబడదు.ఈ ఆలయపు ఆవరణలో నున్న విగ్రహములలోకెల్లా ఒక విగ్రహము వింతగా నున్నది. ఒక నల్లరాతిపైన నగ్నమై, రెండు మోకాళ్ళను దౌడలకు తగులునట్లు మడచుకొని కూర్చొని ఉన్న స్త్రీ మూర్తి చెక్కబడి ఉన్నది. ఇది భూదేవి విగ్రహమట.
 
== దక్షిణకాశీగా పేరొందిన ఆలంపురం ==
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు