ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
ముస్లిములకు ఈదుల్ ఫితర్, ఈదల్ అదా పండుగలు రెండూ అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుర్తుచేసుకోవడానికి, పేదలకు సహాయం అందించడానికి సందర్భాలు.
 
== ఆచార వ్యవహారాలు ==
ఈద్-ఉల్-ఫితర్‌ను ఒకరోజు కానీ, రెండు రోజులు కానీ, మూడురోజుల పాటు కానీ జరుపుకుంటారు. పండుగ పూట సాధారణంగా శుభాకాంక్షలు ''ఈద్ ముబారక్'' అని కానీ, ''ఈద్ స‌ఇద్'' అని కానీ [[అరబ్బీ భాష|అరబిక్]]‌లో చెప్పుకుంటారు. పలు దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు- ఉదాహరణకు టర్కీలో''బయ్‌రమినిజ్ కుత్లుఒల్సన్'' (మీ పండుగ దివ్యంగా ఉండాలి) అని శుభాకాంక్షలు చెప్పుకుంటూంటారు.ముస్లిములు తమ మధ్య ఉన్న విభేదాలు, వివాదాలు మరచిపోవడానికి, ఆ ఏడాదిలో ఏర్పడ్డ కక్షలూ కార్పణ్యాలు మరిచిపోయి ఒకరినొకరు క్షమించుకోవడానికి ''ఈద్-ఉల్-ఫితర్''ను ఒక అవకాశంగా తీసుకోవాలని సంప్రదాయం ప్రోత్సహిస్తోంది.
 
మతాన్ని అనుసరించే ముస్లింలు సాధారణంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి సలాతుల్ ఫజ్ర్ (సూర్యోదయానికి ముందు ప్రార్థనలు) చేసి, కాలకృత్యాలు, స్నానం అనంతరం కొత్త బట్టలు కానీ, ఉన్నంతలో మంచి బట్టలు కానీ ధరిస్తారు, [[అత్తరు]] చల్లుకుంటారు.<ref>{{cite web |url=http://www.jannah.org/articles/eid.html |title=The Significance of Eid |website=Jannah.org |access-date=11 August 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు