ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== ఆచార వ్యవహారాలు ==
[[File:Istiqlal Mosque Eid ul Fitr Jamaah 1.JPG|thumb|ఇండోనేషియాలోని, జకార్తాలో ఇస్తిఖ్లాల్ మసీదు వద్ద ''ఈద్-ఉల్-ఫితర్'' నాడు సమిష్టిగా ప్రార్థన చేస్తున్న దృశ్యం]]
ఈద్-ఉల్-ఫితర్‌ను ఒకరోజు కానీ, రెండు రోజులు కానీ, మూడురోజుల పాటు కానీ జరుపుకుంటారు. పండుగ పూట సాధారణంగా శుభాకాంక్షలు ''ఈద్ ముబారక్'' అని కానీ, ''ఈద్ స‌ఇద్'' అని కానీ [[అరబ్బీ భాష|అరబిక్]]‌లో చెప్పుకుంటారు. పలు దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు- ఉదాహరణకు టర్కీలో''బయ్‌రమినిజ్ కుత్లుఒల్సన్'' (మీ పండుగ దివ్యంగా ఉండాలి) అని శుభాకాంక్షలు చెప్పుకుంటూంటారు.ముస్లిములు తమ మధ్య ఉన్న విభేదాలు, వివాదాలు మరచిపోవడానికి, ఆ ఏడాదిలో ఏర్పడ్డ కక్షలూ కార్పణ్యాలు మరిచిపోయి ఒకరినొకరు క్షమించుకోవడానికి ''ఈద్-ఉల్-ఫితర్''ను ఒక అవకాశంగా తీసుకోవాలని సంప్రదాయం ప్రోత్సహిస్తోంది.
 
మతాన్ని అనుసరించే ముస్లింలు సాధారణంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి సలాతుల్ ఫజ్ర్ (సూర్యోదయానికి ముందు ప్రార్థనలు) చేసి, కాలకృత్యాలు, స్నానం అనంతరం కొత్త బట్టలు కానీ, ఉన్నంతలో మంచి బట్టలు కానీ ధరిస్తారు, [[అత్తరు]] చల్లుకుంటారు.<ref>{{cite web |url=http://www.jannah.org/articles/eid.html |title=The Significance of Eid |website=Jannah.org |access-date=11 August 2013}}</ref> ఈద్ నాడు ఉపవాసం ఉండడం నిషిద్ధం ([[హరామ్]]). దీన్ని గుర్తిస్తూండేలా చిన్న తీపి పదార్థంతో (ఖర్జూర పండు శ్రేష్ఠం) బ్రేక్‌ఫాస్ట్ చేసి మరీ ''సలాత్'' అనే ఈద్ ప్రార్థనలకు బయలుదేరాలి.
 
ఈద్ ప్రార్థనలు చేయడానికి ముందు పేదలకు ధనసహాయం చేయడం ఈద్-ఉల్-ఫితర్ నాడు తప్పనిసరి, దీన్నే అరబిక్‌లో ''జకాత్-ఉల్-ఫితర్'' అంటారు.<ref>{{cite web |url=http://www.islamicfinder.org/articles/article.php?id=405&lang |title=Articles and FAQs about Islam, Muslims |website=Islamicfinder.org |access-date=11 August 2013}}</ref> సంతోషాన్ని వ్యక్తంచేయడం, సాధ్యమైనంత దానధర్మాలు చేయడం, స్థానిక మసీదులో ఫజ్ర్ ప్రార్థనలు చేయడం, ''సలాద్'' అన్న ప్రత్యేక ప్రార్థనలకు వెళ్ళడం, ఒక బహిరంగ ప్రదేశంలో ''తక్బిరాత్'' చదవడం, ప్రార్థనలకు వెళ్ళేప్పుడు ఏ వాహనాలూ వాడకుండా నడిచే వెళ్ళడం వంటివి ''ఈద్-ఉల్-ఫితర్'' నాడు పాటించాల్సిన కొన్ని సాధారణమైన ఆచారాలు. బహిరంగ ప్రదేశంలో కానీ, ప్రార్థనా స్థలంలో కానీ ''సలాత్'' చేసేప్పుడు మసీదులో వర్తించే నియమాలే వర్తిస్తాయి. అల్లాను వ్యక్తం చేసే ఖురాన్ వచనాలు, ప్రార్థనా సందేశాలు తప్ప మరేమీ పలుకకూడదు, ఈద్ ''సలాత్'' చేయడానికి ముందు, తర్వాత ఇమామ్ ప్రసంగ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి వంటివి అవి. ఇతర ముస్లిములకు ''ఈద్ ముబారక్'' అంటూ శుభాకాంక్షలు పలకాలు. ''అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లాఇలాహ ఇల్లల్లాహ్ వాల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వాలిల్లాహిల్లహమద్'' అంటూ ''తక్‌బీర్'' మంద్రంగా జపిస్తూ ఈద్ ప్రార్థనలకు సాగాలి, ప్రార్థనా ప్రదేశంలో కూడా ఇమామ్ కార్యకలాపాలు ప్రారంభించేలోగా ఈ ''తక్‌బీర్'' జపించాలి.<ref>{{cite web |author=Mufti Taqi Usmani |url=http://www.albalagh.net/general/shawwal.shtml |title=Shawwal: On Eid Night, Eid Day, and During the Month |website=Albalagh.net |access-date=11 August 2013}}</ref> ప్రార్థనా ప్రదేశానికి ఇంటి నుంచి వెళ్ళడానికి ఒకదారిలోనూ, వెనుదిరిగి రావడానికి మరోదారిలోనూ నడవడం విధాయకం. పండుగ నాడు మహిళలు కూడా ''సలాత్'' చేయడం సంప్రదాయం. సాధారణంగా ప్రార్థనలకు ముస్లిములను పిలుస్తూ ఆధాన్, ఇఖమా వంటి పిలుపులు అందిస్తారు, అయితే ఈద్ ప్రార్థనలకు అలాంటి పిలుపు ఉండదు.
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు