ఈద్-ఉల్-ఫితర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
ఈద్ ప్రార్థనలు చేయడానికి ముందు పేదలకు ధనసహాయం చేయడం ఈద్-ఉల్-ఫితర్ నాడు తప్పనిసరి, దీన్నే అరబిక్‌లో ''జకాత్-ఉల్-ఫితర్'' అంటారు.<ref>{{cite web |url=http://www.islamicfinder.org/articles/article.php?id=405&lang |title=Articles and FAQs about Islam, Muslims |website=Islamicfinder.org |access-date=11 August 2013}}</ref> సంతోషాన్ని వ్యక్తంచేయడం, సాధ్యమైనంత దానధర్మాలు చేయడం, స్థానిక మసీదులో ఫజ్ర్ ప్రార్థనలు చేయడం, ''సలాత్'' అన్న ప్రత్యేక ప్రార్థనలకు వెళ్ళడం, ఒక బహిరంగ ప్రదేశంలో ''తక్బిరాత్'' చదవడం, ప్రార్థనలకు వెళ్ళేప్పుడు ఏ వాహనాలూ వాడకుండా నడిచే వెళ్ళడం వంటివి ''ఈద్-ఉల్-ఫితర్'' నాడు పాటించాల్సిన కొన్ని సాధారణమైన ఆచారాలు. బహిరంగ ప్రదేశంలో కానీ, ప్రార్థనా స్థలంలో కానీ ''సలాత్'' చేసేప్పుడు మసీదులో వర్తించే నియమాలే వర్తిస్తాయి. అల్లాను వ్యక్తం చేసే ఖురాన్ వచనాలు, ప్రార్థనా సందేశాలు తప్ప మరేమీ పలుకకూడదు, ఈద్ ''సలాత్'' చేయడానికి ముందు, తర్వాత ఇమామ్ ప్రసంగ సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి వంటివి అవి. ఇతర ముస్లిములకు ''ఈద్ ముబారక్'' అంటూ శుభాకాంక్షలు పలకాలు. ''అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లాఇలాహ ఇల్లల్లాహ్ వాల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వాలిల్లాహిల్లహమద్'' అంటూ ''తక్‌బీర్'' మంద్రంగా జపిస్తూ ఈద్ ప్రార్థనలకు సాగాలి, ప్రార్థనా ప్రదేశంలో కూడా ఇమామ్ కార్యకలాపాలు ప్రారంభించేలోగా ఈ ''తక్‌బీర్'' జపించాలి.<ref>{{cite web |author=Mufti Taqi Usmani |url=http://www.albalagh.net/general/shawwal.shtml |title=Shawwal: On Eid Night, Eid Day, and During the Month |website=Albalagh.net |access-date=11 August 2013}}</ref> ప్రార్థనా ప్రదేశానికి ఇంటి నుంచి వెళ్ళడానికి ఒకదారిలోనూ, వెనుదిరిగి రావడానికి మరోదారిలోనూ నడవడం విధాయకం. పండుగ నాడు మహిళలు కూడా ''సలాత్'' చేయడం సంప్రదాయం. సాధారణంగా ప్రార్థనలకు ముస్లిములను పిలుస్తూ ఆధాన్, ఇఖమా వంటి పిలుపులు అందిస్తారు, అయితే ఈద్ ప్రార్థనలకు అలాంటి పిలుపు ఉండదు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఈద్-ఉల్-ఫితర్" నుండి వెలికితీశారు