వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

→‎అతడు-అతను: కొత్త విభాగం
పంక్తి 113:
తెలుగు వికీపీడియా వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం మనం ఏకవచనాన్ని పలు చర్చల అనంతరం స్వీకరించాం. అందువల్ల మనం చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడుతున్నాం. ఈ క్రమంలో బహువచనం కాబట్టి ఆయన, ఆవిడ కాక అతను/ఆమె అన్నవే స్వీకరిస్తున్నాం. కానైతే అతను-అతడు అన్న వాటిలో దేన్నివాడాలన్నది కూడా నిర్దిష్టంగా నిర్ణయించుకుంటే ఏకవచన-బహువచన ప్రయోగాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది, అంతా ఒక చేతిమీదుగా రాసినట్టు ఒకే శైలిలో వ్యాసాలు రూపొందించుకునే ప్రయత్నంలో ఉపయోగపడుతుంది.<br>
ప్రస్తుతం అతడు-అతను, ఇతడు-ఇతను అన్న రూపాలను ఎవరికి తోచిన విధంగా వారు వాడుతున్నాం. అతడు అని రాసిన పేరాలోనే మరోచోట అతను అని రాయడం, ఇతను అని ప్రారంభించిన వ్యాసంలో ఇతడు అని వాడడం గమనించవచ్చు. మానవీయంగా వెతికి లెక్కిస్తే దాదాపు 15 వందల పైచిలుకు వ్యాసాల్లో అతడు, ఇతడు, ఇతను అన్న ప్రయోగాలు, రెండు వేల వ్యాసాల్లో అతను అన్న పదప్రయోగాలు కనిపిస్తున్నాయి.<br>
కాబట్టి అతడు-ఇతడు, అతను-ఇతను అన్న రూపాల్లో ఏది స్వీకరించాలో నిర్ణయిస్తే బావుంటుంది.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:42, 13 మే 2018 (UTC)
=== అభిప్రాయాలు-చర్చ ===