వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
కాబట్టి అతడు-ఇతడు, అతను-ఇతను అన్న రూపాల్లో ఏది స్వీకరించాలో నిర్ణయిస్తే బావుంటుంది.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:42, 13 మే 2018 (UTC)
=== అభిప్రాయాలు-చర్చ ===
* '''అతను-ఇతను''': తెలుగు సాహిత్యంలోనూ, పత్రికా ప్రయోగంలోనూ విస్తారంగా ఆయన-చేశాడు అన్న ప్రయోగం కనిపిస్తోంది. కానీ అది మనకు బహువచనమన్న కారణంగా ఆమోదయోగ్యం కాదు కనుక (అంటే ఒసామా బిన్ లాడెన్ ఒక ఉగ్రవాది, ఆయన అమెరికాపై 9/11 ఉగ్రవాదదాడులకు వ్యూహకల్పన చేశాడు అని వాడలేం కదా, అక్కడ మాత్రం అతను అని రాస్తే పాక్షికత వచ్చేస్తుందన్న కారణంగా ఆయన అన్నదాన్ని తిరస్కరిస్తున్నాం. ఒకవేళ ఆయన అన్నదే వాడాలి అంటే ఒసామా బిన్ లాడెన్, ప్రభాకరన్, కసబ్ వంటి ఉగ్రవాదులకు, బిల్లా-రంగా వంటి ప్రముఖ నేరస్తులకు కూడా వాడేలా ఉంటేనే ప్రతిపాదించాలి) అతను-ఇతను అన్నది ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే 1. ఇతడు వచ్చాడు అనడంలో రెండుసార్లు డుకార ప్రయోగం జరిగి కనీస గౌరవానికీ భంగంగా కనిపిస్తూంది, 2. వ్యవహారికంగా ''అతను వచ్చివెళ్ళాడు'' అని తప్ప ''అతడు వచ్చివెళ్ళాడు'' అన్న ప్రయోగం అసహజం. తెవికీపీడియాలో వ్యవహారిక భాష, సరళమైన భాష ప్రయోగించాలన్న నియమం ఉన్నది. కాబట్టి నేను '''అతను-ఇతను''' అన్న ప్రయోగాన్ని సమర్థిస్తున్నాను. ఆమె అన్నదాని విషయంలో ఈ సమస్య లేదు కాబట్టి ఆమె కొనసాగాలి.