హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
ఒక చక్రవర్తి. ఇతని తండ్రి త్రిశంకువు. భార్య [[చంద్రమతి]]. కొడుకు [[లోహితాస్యుఁడు]]. మంత్రి సత్యకీర్తి. ఇతఁడు మహాసత్యసంధుఁడు. ఒకనాఁడు [[దేవేంద్రుఁడు]] సుధర్మాభ్యంతరమున కొలువు తీరి ఉండి అప్పుడు అచట ఉండిన మహర్షులను కని ప్రపంచమున తాము ఎఱిఁగినవారి లోపల సత్యసంధుఁడు ఎవఁడు అని ప్రశ్న చేయఁగా వసిష్ఠ మహర్షి హరిశ్చంద్రుఁడు అని పలికెను. ఆమాటకు విశ్వామిత్రుఁడు సహింపక హరిశ్చంద్రుఁడు అంత సత్యసంధుడా అతనిని బొంకించెదను చూడుము అని శపథము చేసి ఇతనికి పెక్కులు ఇడుములు కలుగచేసెను. అది ఎట్లనిన తొలుత ఇతని రాజ్యమును దానరూపమున పరిగ్రహించి అనంతరము అంతకు ముందు ఇతఁడు తన యజ్ఞమునకై ఇచ్చునట్లు వాగ్దత్తముచేసి ఉండిన ధనమును ఇమ్మని నిర్బంధించి దానికి ఇతని భార్యను అమ్మించి చండాలుని కొలుచునట్లును శ్మశాన భూమియందు వసించునట్లును చేసి ఇతని కొడుకును పాముచే కఱపించి చంపి ఆవల నిరపరాధ అయిన ఇతని భార్యపై శిశుహత్యాపాతకమును మోవఁజేసి ఆమెను శిక్షార్హురాలు అగునట్లు చేయించి ఎట్లును బొంకింప నేరక పోయెను. కడపట తన ప్రయత్నము ఎల్ల వ్యర్థములు అయిపోఁగా రుద్రాదిదేవతలు ఈ హరిశ్చంద్రునికి ప్రత్యక్షము అయి ఇతని కొడుకును బ్రతికించి మరల మునుపటియట్ల రాజ్యాధిపత్యము వహించునట్లు అనుగ్రహించిరి. అప్పుడు విశ్వామిత్రుఁడు తాను తీసికొన్న రాజ్యమును ఇచ్చి బహుకాలము శ్రమకు ఓర్చి తపస్సుచేసి ఆర్చించిన మహాపుణ్యఫలమును ఇతనికి ధారపోసి చిరకాలము రాజ్యపదస్థుఁడవై సత్య హరిశ్చంద్రుఁడు అన విఖ్యాతిని ఒందుము అని ఆశీర్వదించి చనియెను. కనుకనే సత్యమునందు హరిశ్చంద్రునికి మించినవారు లేరు అని జగద్విఖ్యాతి కలిగి ఉన్నది.
 
[[విశ్వామిత్రుడు|ఇట్లు [[విశ్వామిత్రుఁడు]] కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.]]
 
== [[విశ్వామిత్రుడు|వినోద మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడు సినిమాగా అనెక బాషలలో పలుసార్లు తీయబడినది. తెలుగు సినిమాగా మరియు నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యతప్రా]]<nowiki/>ముఖ్యత సంపాదించింది. ==
[[రాజా హరిశ్చంద్ర]] పేరుతో, భారత తొట్టతొలి సినిమా (హిందీ), [[1913|1222]]<nowiki/>లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని [[దాదాసాహెబ్ ఫాల్కే]] నిర్మించాడు.
 
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు