వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
* గూగుల్ సెర్చ్ లో "అతను" కు 67,10,00,000, "అతడు" కు 10,70,000 ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి "అతను" ప్రయోగం విస్తారంగా వాడుకలో ఉన్నట్లు కనిపిస్తుంది. వ్యవహారికంగానూ "అతను" అనే పదం సరియైననది సమర్థిస్తున్నాను. "అతను" ఉపయోగించి రెండు వ్యాసాలు కూడా రాసాను. ఈ పదం బాగుందని అనిపించింది. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:54, 14 మే 2018 (UTC)
*వ్యాసంలో సందర్భాన్నిబట్టి పురుషులకు అతడు,ఇతడు,అతను,ఇతను,ఆయన,ఈయన వంటి పదాలు, అలాగే స్త్రీలకు ఆమె,ఈమె,ఆవిడ,ఈవిడ వంటి పదాలు వ్రాయవచ్చును అని నా అభిప్రాయం. అలాగే వారు, వీరు, వచ్చారు, వెళ్ళారు అనే పదాలు చివర 'రు ' అనే అక్షరం బహువచనం సూచిస్తున్నదని వికీ తెలుగు (పండితులు) పెద్దలు అంటున్నారు, కానీ తెలుగు వాడుకలో ఈ పదాలు కూడా ఏకవచనానికి వాడతాము.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:51, 15 మే 2018 (UTC)
** జేవీఆర్కే ప్రసాద్ గారూ! తెలుగు వాడుకలో బహువచన క్రియాపదాలు వ్యక్తికి వాడి గౌరవించడం ఒకానొక సంప్రదాయమని తెలియక కాదు తెలుగు వికీపీడియన్లు ఏకవచనాన్ని స్వీకరించింది. మనం రాసేప్పుడు వ్యక్తిగా పవన్ సంతోష్ కానీ, జేవీఆర్కే ప్రసాద్ గారు కానీ, సుజాత గారు కానీ కనిపించకుండా వికీపీడియా అన్నదే కనిపిస్తుంది కాబట్టి వికీపీడియా కొందరికి గౌరవ వాచకంగా బహువచనం, కొందరికి ఏకవచనం ప్రయోగిస్తే పక్షపాత ధోరణితో ఉంటుంది కాబట్టి ఇది స్వీకరించారు. ఒకవేళ అందరికీ రు పెట్టాల్సివస్తే, [[ఒసామా బిన్ లాడెన్]] అనేక ఉగ్రవాద దాడులకు రూపకల్పన చేశారు అని రాయలేం కనుక అందరికీ డు పెడుతున్నాం. అయితే ఈ చర్చ కేవలం అతను-అతడు వరకే పరిమితం తప్ప రు-డుల చర్చ కాదని, కాబట్టి విస్తృతమైన బహువచనాల గురించిన చర్చ ఇక్కడ చేయలేమని మనవి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:00, 15 మే 2018 (UTC)