వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
: [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASADగారూ]] పై చర్చ ''అతడు-అతను'' అన్న అంశం విభాగాన్ని విడదీసి ఇది వేరు చేశారు, సంతోషం. మీ ప్రశ్నల్లో కొన్నిటికి నేను నా అవగాహన మేరకు సమాధానం రాస్తాను.
* ''ఎన్ని వందలమంది నిర్ణయించారో'': వికీపీడియా విధానాల విషయంలో ఎప్పుడైనా ఎందరు నిర్ణయించారన్న ప్రశ్న ఉదయించకూడదు, '''ఏయే అంశాల ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్నే రావాలి''', వికీపీడియా 5 మూలస్తంభాలు ఈ నిర్ణయంలో ఏమేరకు ప్రతిఫలిస్తున్నాయో చూడాలి. వికీపీడియాలో విధానాలు (పాలసీలు) నిర్ణయించేప్పుడు మందిబలంతో జరిగే ఓటింగు ప్రక్రియ ఆమోదయోగ్యం కాదు, దానికి భిన్నంగా "నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క విధానాలను మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ"గా దీన్ని [[వికీపీడియా:ఏకాభిప్రాయం|వికీపీడియా ఏకాభిప్రాయం]] విధానం చెప్తోంది. ఏకాభిప్రాయం అంటే ఏకగ్రీవమూ కాదు, ఓటింగు ప్రక్రియా కాదు.
* ''ఏకవచనం గురించి ఎక్కడ ఉంది'': తెలుగు వికీపీడియాలో "వ్యాస పేరుబరిలో" ఏకవచన ప్రయోగం ప్రస్తుతం అమలులో ఉంది. దీనిని గురించి చెప్పే విధానం [[వికీపీడియా:ఏకవచన ప్రయోగం]] అన్నదగ్గర మనం క్రోడీకరించుకున్నాం. దాని చర్చ పేజీలోనూ, ఇతర చోట్లా మీతో సహా చాలామంది చర్చలు జరిపారు. '''మనం చర్చల్లో ఎన్ని అభిప్రాయాల్లోనైనా ఉండవచ్చువ్యక్తం చేయవచ్చు, కానీ ఒక్కమారు నిర్ణయం జరిగాకా మాత్రం ఆ నిర్ణయాన్ని అమలుచేయాలి''' అన్నది నా అభిప్రాయం, నిశ్చితమైన నమ్మకం. మరోమారు మళ్ళీ చర్చించుకోవచ్చు, కానీ అవతలివారు చెప్పిన వాదన అర్థం చేసుకుని దానికి ప్రతివాదన లభిస్తేనే చేయడం వల్ల తిరిగి తిరిగి అవే విషయాలు మాట్లాడుకుని అవే నిర్ణయాలు చేసే పనివుండదు. అన్నిటికీ మించి విషయాన్ని చర్చించి నిర్ణయించాలి. వాదనలో బలం ఉంటేనే వాదన నెగ్గుతుదంఇనెగ్గుతుంది. సరే ఇదిలా ఉంచితే నాకు వ్యక్తిగతంగా "చెప్పారు", "చేశారు" అని రాయడమే అలవాటు, వికీపీడియాలో నిర్ణయం అంయింది కదాని వికీపీడియా వ్యాసాల్లోలో మట్టుకు "చేశాడు" అని రాస్తున్నాను.
* ఒసామా ఉదాహరణ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వ్యక్తిగతంగా నా స్వంత పుస్తకంలో రాసుకోవాల్సి వస్తే "ఒబామా నెగ్గారు", "ఒసామా చనిపోయాడు" అనే రాస్తాను. అక్కడ వ్యక్తిగా పవన్ సంతోష్ ఒబామా పట్ల కనీస గౌరవం ఉన్నవాడు, ఒసామా అంటే గౌరవం లేని మనిషి. కానీ వికీపీడియాలో అలా రాయకూడదు, ఎందుకూ అంటే మంచిదైనా, చెడ్డదైనా '''వికీపీడియా ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్టు ఉండకూదు''' కనుక. రాసినది ఒసామా అంటే అసహ్యం ఉన్న పవన్ సంతోష్, జేవీఆర్కే గారలైనా వారి వారి అభిప్రాయాలు వికీపీడియా వ్యాసం వ్యక్తం చేయదు, చేయకూడదు.
* చర్చల్లో జేవీఆర్కే ప్రసాద్ గారిని గారు అనడం నా ఇష్టం ఎందుకు అంటే ఇది వ్యక్తిగతమైన పాఠ్యం కనుక. కింద నా సంతకం ఉంటుది కనుక. అలా వ్యాసాల్లో సంతకాలు ఉండవు, ఉండరాదు. ఉదాహరణకు చర్చల్లో [[వాడుకరి:pranay raj1985pranayraj1985]]ని ప్రణయ్ రాజ్ గారు అని పిలిస్తే పవన్ సంతోష్ అనే వ్యక్తి [[వాడుకరి:pranayraj1985]] పట్ల చూపించే గౌరవం అని అర్థం అవుతుంది, అదే [[ప్రణయ్‌రాజ్ వంగరి]] అన్న వ్యాసంలో గౌరవవాచకాలు నేను పెట్టాననుకోండి, అప్పుడు వికీపీడియా గౌరవం చూపినట్లు అవుతుంది. కాబట్టి కనీస గౌరవం తప్ప ప్రత్యేక గౌరవం కానీ, ప్రత్యేక అగౌరవం కానీ ఎవరికీ వికీపీడియా చేయకూడదు, వికీపీడియన్లు వారి వారి వ్యక్తిగత స్థాయిలో చేయవచ్చు.
మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇవి, ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 15 మే 2018 (UTC)