వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇవి, ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 15 మే 2018 (UTC)
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు, మీరు వికీపీడియనులు వ్యాసాలు ఒకసారి చదవండి, వ్యాసాలు ఎలా వ్రాసారో మీకు తెలుస్తుంది. ఉదా: డా.రాజశేఖర్ గారి వ్యాసం ఎలా వ్రాసారో అలాగే వ్రాస్తే బాగానే ఉంటుంది కదా ! అన్ని వ్యాసాలు ఒకే రీతిగా ఉండాలా లేక వ్యక్తులును బట్టి ఉండాలో కూడా ఒక సందేహం వాడుకరులకు కూడా ప్రశ్న ఉదయిస్తుంది. అందరి గురించి, అన్ని వ్యాసాలు ఒకే రీతిగా, తీరులో వ్రాయాలనే పాలసీ నా మనసుకు అంతగా ఒప్పటము లేదు. మీ స్పందనలకు సంతోషం, నాకు ఎవరితోనూ సమస్యలు లేవు, పెట్టుకోను. ఇక్కడ నిర్ణయాలు అన్నీ అమలు పరిచేది కేవలం కొద్దిమంది మాత్రమే. వారి పాలసీలు తప్ప మరొకరివి అమలు జరగవు. దేనికైన కొత్తవాటికి అయినా వారి అభిప్రాయాలు తీసుకుని అమలు చేసుకుంటే చాలా తేలిక. మిగతావారి అభిప్రాయాలు లెక్కకోసం, భంగపడటం కోసం మాత్రమే. ఇది సత్యం. మీ స్పందనలకు ధన్యవాదములు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:16, 15 మే 2018 (UTC)
::::[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD గారూ]] నేను వికీపీడియన్ల వ్యాసాలన్నీ చదివాను, అవన్నీ ఏకవచన ప్రయోగం విషయంలో సరిదిద్దాలి. అవి ఎలా ఉన్నాయన్నదాన్ని బట్టి ఈ చర్చ చేయట్లేదు, ఎలావుండాలని తెలుగు వికీపీడియా విధానం చెప్తోంది అన్నదాని ఆధారంగా చేస్తున్నాను. పాలసీకి విరుద్ధంగా ఉన్న ప్రయోగాలు, పాలసీకి అనుగుణంగా దిద్దాలి. అలానే వికీపీడియా వ్యాసం ఎవరి పట్లా విశేష గౌరవాన్ని కానీ, అగౌరవాన్ని కానీ చూపకూడదన్నది కేవలం కొందరు చర్చించి రూపొందించిన ఒకానొక పాలసీలోనే ఉన్నది కాదు [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|వికీపీడియా రెండవ మూలస్తంభం]] '''"వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు."''' అంటూ దాన్నే స్పష్టం చేస్తోంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:27, 15 మే 2018 (UTC)