ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 112:
1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత అతని రాజకీయ జివితం పునరుద్ధరించబడింది. అప్పటి ప్రధానమంత్రి [[పి.వి.నరసింహరావు]] అతనిని భారత ప్లానింగ్ కమీషన్ కు డిప్యూటీ చైర్మన్ పదవినిచ్చాడు. తరువాత మొదటి సారి పి.వి.నరసింహారావు కేబినెట్ లో 1995 నుండి 1996 వరకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="GOVT" />
 
గాంధీ విధేయుడిగా ముఖర్జీ సోనియా గాంధీ రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెకు రాజకీయ గురువుగా భాద్యతలను చేపట్టాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /> అతను 1998-99 లో ఎ.ఐ.సి.సి కి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అతను 2010లో రాజీనామా చేసే వరకు పశ్చిమ బెంగాల్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను 1985 లో ఇదే పదవిని నిర్వహించారు.<ref name="PMI2PMI" />
 
ముఖర్జీ 2004లో లోక్‌సభ నాయకునిగా ఉన్నాడు. <ref name="GOVT" /> అతను పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లెమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి 2009 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. 2004 లో సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధానమంత్రి స్థాయిని తిరస్కరించిన తర్వాత ముఖర్జీని భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తారని ఊహాగానాలు జరిగాయి.<ref name="red">{{cite web|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr Singh Sonia's choice?|date=19 May 2004|accessdate=10 August 2012|publisher=Rediff}}</ref> అయితే, సోనియా గాంధీ చివరికి [[మన్మోహన్ సింగ్]] ను ప్రధానమంత్రిగా నియమించింది.<ref name="zee news" />
పంక్తి 123:
 
=== రాజకీయ పార్టీలో పాత్ర ===
ప్రణబ్ ముఖర్జీని "పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు."<ref>{{cite news|url=http://servihoo.com/Aujourdhui/kinews/afp_details.php?id=140225&CategoryID=74|title=India's new foreign minister Mukherjee: a respected party veteran|date=24 October 2006|accessdate=9 April 2007|agency=Agence France-Presse}}</ref> అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎ.ఐ.సి.సి) సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చేరాడు. 1978 లో ఎ.ఐ.సి.సి మరియు కాంగ్రెస్ లలో కోశాధికారిగా పనిచేసాడు.<ref name="PMI3PMI" />
 
1984, 1996 మరియు 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ.ఐ.సి.సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. 1999 జూన్ 28 నుండి 2012 వరకు ఎ.ఐ.సి.సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ భాద్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యాడు.<ref name="PMI3PMI" /> 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్" గా గుర్తింపబడ్డాడు.
 
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రతిభను 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు