వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
* నేను సమర్ధించను. వ్యాసంలో సందర్భాన్ని బట్టి ఈ రెండు పదాలే కాదు, అనేక పదాలు వాడుకోవచ్చును.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:15, 15 మే 2018 (UTC)
* వ్యక్తుల గురించి వ్యాసాలు వ్రాసేటప్పుడు మనం ఏ వ్యక్తి గురించి వ్రాస్తున్నామో అతని గురించి "అతడు/అతను/ఆయన/ఆమె" అని కాకుండా "ఇతడు/ఇతను/ఈయన/ఈమె" అని సంబోధిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు మనం ఎవరి గురించి వ్రాస్తున్నామో వారు మన ముందు ఉన్నట్లే ఉంటుంది. అదే వ్యాసంలో ఇతరుల గురించి అంటే ఆ వ్యక్తి తండ్రి లేదా గురువు వగైరాల గురించి వ్రాసినప్పుడు వారిని "అతడు/అతను/ఆయన" అని సంభోదిస్తే సరిపోతుంది. ఇకపోతే అతడు/ఇతడు అనే పదాలను అతను/ఇతను అనే పదాలతో మార్పుచేయాలన్న ప్రతిపాదనను సమర్థించడం లేదు. ఆయన/ఈయన పదాలను బహువచనాలుగా కూడా అంగీకరించను. ఆయన వచ్చాడు, ఈయన వెళ్ళాడు వంటి ప్రయోగాలు అంగీకారయోగ్యమైనవే. ప్రస్తుతం ఉన్నవాటిని మార్పులు చేయకుండా అలాగే ఉంచి కొత్తగా వ్రాసే వ్యాసాలలో అతను/ఇతను వాడితే సరిపోతుంది. --[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 02:05, 19 మే 2018 (UTC)
** [[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] గారూ, అతను, ఇతను అనే పదాలతో ఇప్పుడున్న అతడు, ఇతడు అన్నవి పదాలు మార్చాలా అన్నది కాదండీ. తెలుగు వికీపీడియాకు ఒక శైలి అన్నది ఏర్పరుచుకోవాలి కాబట్టి మనం రాసేదంతా ఒకచేతి మీద రాసినట్టుగా రావాలి కాబట్టి మనకొక శైలి ఉండాలి. అందులో భాగం ఈ ప్రయత్నాలు. అతడు/అతను/ఆయన అన్న మూడిటిలో ఏదో ఒకదాన్ని మన మూలసూత్రాలకు అనుగుణమైనదని ఎంచుకుంటే ఆ ప్రకారమే వికీపీడియాలో రాయాల్సివస్తుంది. ఏదో ఒకటి కాదు, మూడూ ఉండవచ్చు అన్నప్పుడు ఇన్‌కన్సిస్టెన్సీ వస్తుంది. దానికితోడు మీరు సూచించినట్టు వ్యాసంలో ఉన్న విషయాన్ని ఇతను అని, వ్యాసంలోని విషయం కానివారిని అతను అని అనడం బావుంటుంది. అదీ మనం స్వీకరిస్తే, అలానే అందరం రాయాల్సివుంటుంది. ఒక శైలి అంటూ నిర్ణయించుకున్నాకా, అదే అనుసరించాలి కదా. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:06, 19 మే 2018 (UTC)
 
==వికీలో వ్యక్తి సంబోధనలు==