పాలకొల్లు పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ సృష్టించబడింది.
(తేడా లేదు)

05:28, 24 మే 2018 నాటి కూర్పు

పాలకొల్లు పురపాలక సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని పాలకొల్లు నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]

పాలకొల్లు పురపాలక సంస్థ
సంకేతాక్షరంPMC
ఆశయంE-enabling City Civic Services
స్థాపన1919
1994 (సంస్థ నవీకరణ)
రకంప్రభుత్వేతర సంస్థ
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన సంస్థ
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
పాలకొల్లు
కార్యస్థానం
సేవాకోస్తా ఆంధ్ర
అధికారిక భాషతెలుగు
చైర్మన్వల్లభనేని నారాయణ మూర్తి
వైస్ చైర్పర్సన్కరినేని రోజా రమణి
మునిసిపల్ కమిషనర్రామ్మోహన్ రావు
ప్రధానభాగంకమిటీ

చరిత్ర

ఈ సంస్థ, ఏప్రిల్ నెలలో 1919 లో పాలకొల్లు పురపాలక సంస్థగా ఏర్పడింది, 1919 లో పాలకొల్లు మునిసిపాలిటీ మూడవ గ్రేడ్ తో ఏర్పడింది మరియు 1965 ఆగస్టు లో మొదటి గ్రేడ్ పురపాలక సంస్థగా ఏర్పడింది. 2019 లో రాబోవు ఎన్నికల్లో పులపల్లి గ్రామ పంచాయతీ, ఉల్లంపర్రు గ్రామ పంచాయతీ మరియు పాలకొల్లు రూరల్ ఏరియా లు నగరంలో విలీనం చేయాలని ప్రతిపాదనలు అమలులో ఉన్నాయి.[2][3]

పరిపాలన

పురపాలక సంస్థ యొక్క ప్రస్తుత ప్రాంతం 19.49 km2 (7.53 sq mi) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, మరియు 32 వార్డులు కలిగిఉంది. ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ గా వల్లభనేని నారాయణ మూర్తి[4] మరియు మున్సిపల్ కమిషనర్ గా రామ్మోహన్ రావు ఉన్నారు.[5]

పురస్కారాలు మరియు విజయాలు

  • నాణ్యత నిర్వహణ వ్యవస్థ కోసం ISO 9001 సర్టిఫైడ్

మూలాలు

  1. "Palakollu Municipal Corporation". Official website of Palakollu Municipality. Retrieved 29 March 2016.
  2. "Administration". Palakollu Municipality. Retrieved 29 March 2016.
  3. "Palakollu Municipal corporation". PMC Urban Development Authority. Retrieved 17 June 2014. {{cite web}}: Check |url= value (help)
  4. "Contact Details of Commissioners and Mayors of Amrut Cities".
  5. "Citizen Services". Palakollu.