జానపద సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., రొజు → రోజు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 19:
ఈ సంగీతం లక్ష్యం కేవలం వినోదం, ఉల్లాసం అందించడమే కాదు. తెలియకుండానే మనిషిలో మానవీయ సంస్కారాన్ని ఇనుమడింపజేస్తుంది. శ్రమతో జీవితాన్ని ఉద్దీపింపజేసుకోవడం అలవరుస్తుంది. సమూహంలో భాగస్వామి అయి పరులు మేలు తలచడంలోనే బతుక్కి సార్థకత వుందని తెలియజేస్తుంది. జానపద గీతాల్లో [[లయ]] చాలా ప్రధానమైనది. ఈ పాటలలోని లయే ఉత్సాహాన్ని కలిగించే అంశం. ఒక ప్రత్యేక లయ అనిగాని, రాగం అని గాని తెలిసి పాడుకునేవారు కారు. వారికి ఇష్టం వచ్చినట్లు రాగయుక్తంగా పాట సాగేది. ఐనా అందులోనే మంచి లయ, రాగం దాగి ఉండేవి.
 
పంట విత్తనాలు వేసేటప్పుడు పాటలు, పంట చేతికొచ్చినప్పుడు [[పాటలు]], పండుగల పాటలు, వారి పశువులకి సంబంధించిన పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ళ పాటలు.. ఇదీ అదీ అని కాకుండా వివిధ అంశాల గురించి ఆనందంగా వారికొచ్చిన భాషలో పాడుకునేవారు. ఇలాంటి సంగీతం జానపదుల గీతాల్లో, నృత్యాల్లో, ఉత్సవాల్లో ప్రతిఫలిస్తుంది. పండుగలో మిళితమై వున్న పాటల్లో, నర్తనంలో ఇమిడివున్న సంగీతమే ఇందుకు దాఖలా. ప్రకృతితో, ప్రకృతిలోని పూలతో, పూల పరిమళా లతో అనుసంధానమై వున్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని వందలపాటలు వచ్చాయి. ఆ పాటలకీ, సంగీతానికీ అవినాభావ సంబంధం ఉంది. సంగీతంలోని రాగం, తాళం, పల్లవి, జతి, లయ వంటి అంశాలు ఈ పాటలతో అనుసంధానమై ఉన్నాయి. నిజానికి [[సాహిత్యం]], నృత్యం వంటి ప్రక్రియలతో కలగలిసి వుండటం భారతీయ సంగీతం ప్రత్యేకత. జీవితంలోని ప్రతి సందర్భాన్ని పాటలతో, సంగీతంతో దీప్తిమంతం చేయడం జనజీవన [[సంస్కృతి]]లో అంతర్భాగం.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జానపద_సంగీతం" నుండి వెలికితీశారు