"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 25 జూలై 2012 → 2012 జూలై 25 (2), అక్టోబర్ → అక్టోబరు, ఇస్రాయిల్ → ఇ using AWB)
ట్యాగు: 2017 source edit
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని [[కాంగ్రెసు|కాంగ్రెస్‌]]<nowiki/>లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. [[సోనియా గాంధీ|సోనియా]] రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
 
 
 
 
 
అందుకే 2004లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్ కూటమి అధికారంలోకి రాగానే, అతను మొదటి సారి లోక్‌సభకు ఎన్నికైనాడు. ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు మంత్రిగా సేవలనందించాడు. అప్పటి నుండి అతను 2012లో తాను రాజీనామా చేసేవరకు [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో రెండవ స్థానంలో గల నేతగా ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2372594" నుండి వెలికితీశారు