శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షరదోషాలను సవరించాను
పంక్తి 54:
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై [[1983]] [[జూన్ 15]] న శ్రీశ్రీ మరణించాడు.
 
[[విశాఖపట్నం]] లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అదెవిధంగాఅదేవిధంగా ఆయన ఇంటిని మహా సంగ్రామ సమర యీచారు
 
==సాహితీ వ్యాసంగం==
పంక్తి 116:
 
===సినిమా రంగం===
ఇతడు మద్రాసులో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమావారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది<ref>{{cite journal|last1=కళానిధి|title=శ్రీశ్రీ|journal=విజయచిత్ర|date=1 May 1970|volume=4|issue=11|pages=46-49|accessdate=28 April 2017}}</ref>. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా [[ఆహుతి (1950 సినిమా)|ఆహుతి]]కి ఇతడు మాటలు పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం "నీరా ఔర్ నందా"కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుగుతెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఈయనే చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో [[హెచ్.ఎం.రెడ్డి]] నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. [[నిర్దోషి (1951 సినిమా)|నిర్దోషి]] సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ [[ప్రపంచం (సినిమా)|ప్రపంచం]] అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి.
 
ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి [[మైసూరు]]కు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి [[బి.విఠలాచార్య]]తో పరిచయం కలిగింది. ఆయన కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులొ కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు!
 
తరవాతతరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. ఎన్నో డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా ఎన్నో పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. ఇతడు స్వయంగా [[చెవిలో రహస్యం]] అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు.
 
===ప్రముఖ సినిమా పాటలు===
పంక్తి 137:
 
== వ్యక్తిత్వం ==
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. ఆయన మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి ఆయన అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని తాకాయి. ఆయన గురించి జీవితచరిత్రకారుడు [బూదరాజు రాధాకృష్ణ] ''శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొడిజగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు'' అంటూ స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించారు.<br />
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. పైగా ఆయన రాసిన ఆత్మకథ ''అనంతం'' సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపారు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా ఆయన ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు