నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
== {{anchor|1999 election victory}}1999 ఎన్నికల విజయం ==
1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను, 1999 సార్వత్రిక ఎన్నికలలో 42 పార్లమెంటు స్థానాలలో 29 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
 
== జాతీయ రాజకీయాలపై ప్రభావం ==
1999లో పార్లమెంటు లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన తరువాత కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’ గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]]<nowiki/>లు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]]<nowiki/>ని ఒప్పించాడు. ఇందులో భాగంగా [[హెచ్.డి.దేవెగౌడ|దేవెగౌడ]] ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా [[ఐ.కె.గుజ్రాల్|ఐకే గుజ్రాల్‌]] ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు. <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542551|title=జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర}}</ref>
 
== {{anchor|Hyderabad's development}}హైదరాబాదు అభివృద్ధి ==