నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
 
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref>
 
 
 
== హెరిటేజ్ ఫుడ్స్ ==
1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. <ref>{{Cite web|url=http://telugutimes.net/home/article/72/1581/heritage-foods-enters-north-india|title=ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ}}</ref>