వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 163:
;ఆంగ్ల వికీపీడియా ఉదాహరణ
ప్రపంచభాషల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాషలో అమెరికన్, బ్రిటన్, ఆస్ట్రేలియన్, ఇండియన్ వంటి అనేక తీవ్ర భేదాలున్న మాండలికాలు ఉన్నాయి. అయితే తెలుగు వంటి భాషలకు ఈ ఆంగ్ల భాషా రూపాలన్నిటా తమదైన ప్రామాణికత ఉన్నది. అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇంగ్లీష్, బ్రిటీష్ స్టాండర్డ్ ఇంగ్లీష్, ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వంటివి ఉన్నాయి, ఈ ప్రామాణిక భాషల్లో పత్రికా భాష, పరిశోధన భాష ఇప్పటికే ఏర్పడివుంది. అయితే అంతర్జాతీయ పాఠకులను (అంటే వివిధ స్థానీయతలకు చెందినవారు) ఉద్దేశించి రాసే ఆంగ్ల వికీపీడియాలో ఏ విధమైన భాష తీసుకోవాలన్న ప్రశ్నకు - ఏ ఒక్క మాండలికాన్నో ఏకైక ప్రామాణిక భాషగా వికీపీడియా స్వీకరించదని నిర్ణయించారు. కనుక ఒక వ్యాసానికి ఏ విధమైన భాషా శైలి స్వీకరించాలన్నదానిపై కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. దాని ప్రకారం 1. అన్ని భాషా శైలులకు సరిపడే సాధారణ శైలిని అవకాశం ఉన్నంతవరకూ స్వీకరించడం 2. వ్యాసంలోని అంశం యొక్క స్థానీయతను బట్టి ఆ స్థానిక రకాన్ని వాడడం అంటే ముంబై గురించి ఇండియన్ ఇంగ్లీష్‌లో, అమెరికా అంతర్యుద్ధం గురించి అమెరికన్ ఇంగ్లీష్‌లో, సిడ్నీ గురించి రాసేప్పుడు ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్‌లో, జార్జ్ బెర్నార్డ్ షా గురించి బ్రిటీష్ ఇంగ్లీష్‌లో, దక్షిణాఫ్రికా జాతి వివక్ష గురించి సౌతాఫ్రికన్ ఇంగ్లీష్‌లో రాయడం పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యాసాలు ఆ ప్రాంతానివి అవుతాయని భ్రమించరాదు. 3. పై రెండు సూత్రాలు వర్తించని చోట్ల వ్యాసంలో అప్పటికే ఏ మాండలిక శైలి వాడుతూంటే ఆ మాండలిక శైలినే కొనసాగించాలి, అవసరమైతే ఈ వ్యాసం ఫలానా ఇండియన్ ఇంగ్లీష్‌లో ఉందని ఓ మూస పెట్టవచ్చు.<br>
ఇప్పుడు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి సభ్యులు ఈ విషయంపై ఆలోచించాల్సిందిగాఆలోచనలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:35, 6 జూన్ 2018 (UTC)