విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 53:
== ప్రాచుర్యం ==
ఈ నవల ధారావాహికగా వెలువడే రోజుల్లో వారం వారం పత్రిక కోసం పాఠకులు ఆత్రుతగా ఎదురుచూసేవారని పలువురు సాహిత్య విమర్శకులు పేర్కొన్నారు. గణపతిశాస్త్రి కూర్చిన అనేక రకాల వర్ణనలను, సౌందర్య వివరాలను అపురూపమైన చిత్రాలుగా బాపు మలిచేవారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా నవల పాఠకలోకంలో ఒక సంచలనంగా నిలిచింది. అనంతర కాలంలో పుస్తకరూపాన్ని సంతరించుకున్న విశాల నేత్రాలు పలుమార్లు పునర్ముద్రితమైంది.<br />
ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2003 ప్రాంతాలలో "ధనుర్దాసు" అన్న పేరుతో దూరదర్శన్ ఈ నవలను చిత్రీకరించి ప్రసారం చేశారు. ఈ నవలను సినిమాగా తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగాయి. ప్రముఖ సినీనటుడు, నిర్మాత ఉప్పలపాటి కృష్ణంరాజు పలుమార్లు విశాల నేత్రాలు చిత్రంగా తీయడం తన కల అంటూ పేర్కొన్నారు. ఆయన సినిమాకు అనుగుణంగా పూర్తిస్థాయి స్క్రిప్టు రాయించుకుని, [[ఉప్పలపాటి ప్రభాస్ రాజు|ప్రభాస్]] కథానాయకునిగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కారణాంతరాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. "విశాలమైన నేత్రాలతో గణపతిశాస్త్రి వర్ణనలకు తగ్గ కథానాయిక దొరకక ఈ కథ చిత్రరూపం దాల్చలేదని" పలు ముఖాముఖీల్లో పాల్గొన్న ఆయన త్వరలోనే విశాలనేత్రాలు సినిమాగా వస్తుందని కూడా చెప్తున్నారు.<ref>[http://archive.andhrabhoomi.net/specials/Vennela%20-%20interviews/content/avineethi] కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref><ref>[http://teluggodu.blogspot.in/2012/01/blog-post_8194.html] 2012 జనవరిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref>
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు